KTR ON CONGRESS: కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా..? జనం ఆలోచించుకోవాలి: కేటీఆర్

తెలంగాణలో అంతా చిన్న, సన్నకారు రైతులే అనీ.. 3 గంటల విద్యుత్ చాలు అని రేవంత్ చెప్పడం దారుణమని అన్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతన్న ఒక దారికి వస్తున్నాడని, మళ్లీ కాంగ్రెస్ వైఖరితో పదేళ్ల క్రితం నాటి పరిస్థితిలోకి వెళ్తారని అర్థమవుతోందన్నారు కేటీఆర్.

  • Written By:
  • Publish Date - November 11, 2023 / 06:31 PM IST

KTR ON CONGRESS: తెలంగాణలో కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో జనం ఆలోచించుకోవాలి అన్నారు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీ రామారావు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి తెలంగాణ రైతాంగం విషయంలో అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు. గతంలో అమెరికాలో అజ్ఞానంతో మాట్లాడాడు అనుకున్నాం. కానీ నిన్న కూడా.. 24గంటల విద్యుత్ కాదు.. మూడు గంటలు సరిపోతుందని నిస్సిగ్గుగా రేవంత్ చెప్పారని ఆరోపించారు కేటీఆర్.

Vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. ఏం హామీ ఇచ్చారంటే..

తెలంగాణలో అంతా చిన్న, సన్నకారు రైతులే అనీ.. 3 గంటల విద్యుత్ చాలు అని రేవంత్ చెప్పడం దారుణమని అన్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతన్న ఒక దారికి వస్తున్నాడని, మళ్లీ కాంగ్రెస్ వైఖరితో పదేళ్ల క్రితం నాటి పరిస్థితిలోకి వెళ్తారని అర్థమవుతోందన్నారు కేటీఆర్. రైతులను కాంగ్రెస్ లీడర్లు గతంలో బిచ్చగాళ్ల తో పోల్చారని ఆరోపించారు. వ్యవసాయంలో ఎన్ని HPల మోటార్‌లు వాడతారో వాళ్ళకి అవగాహన లేదన్నారు. గత కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాల కాలంలో నిద్ర లేక రాత్రిళ్ళు కరెంటు కోసం బావుల దగ్గర రైతులు పడిగాపులు కాసిన రోజులు గుర్తు చేసుకోవాలన్నారు కేటీఆర్. గతంలో రైతులకు క్రాప్ హాలిడేస్.. పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఉన్నాయని, ఇదే కాంగ్రెస్ విద్యుత్ విధానమని మండిపడ్డారు. దేశంలోనే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. నెలకి రూ.1000 కోట్ల రూపాయలు కేవలం ఉచిత విద్యుత్‌పైనే ప్రభుత్వం ఖర్చు చేస్తోందిని, కేంద్రం ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టినా మోటార్లకు మీటర్లు పెట్టబోనని కేసీఆర్ అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు.

కరోనా సమయంలో కూడా 7 వేలకు పైగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొన్నామన్నారు. ప్రధాని కూడా మన పథకాన్ని కాపీ కొట్టి.. pm కిసాన్ తెచ్చారని తెలిపారు. ఉచిత విద్యుత్, 24 గంటల కరెంట్ వద్దన్న కాంగ్రెస్‌ను పొలిమేరల వరకూ తరిమి కొట్టాలని కేటీఆర్ పిలుపు ఇచ్చారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను 3 గంటల కరెంటుపై రైతులు నిలదీయాలని కోరారు కేటీఆర్. కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. కొడంగల్‌లో రేవంత్ ఓడిపోతున్నాడు. గెలిస్తే కదా సంతకాల మాటకు అర్థం ఉంటుందని కేటీఆర్ కామెంట్ చేశారు.