KTR: హైదరాబాద్ కంపెనీలను బెంగళూరు తీసుకెళ్తున్న కాంగ్రెస్: కేటీఆర్

త్వరలో తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందని, ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ బెంగళూరుకు మార్చేస్తాం అని లేఖలో పేర్కొన్నారు. ఇది కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ.. కలిసి చేస్తున్న కుటిల ప్రయత్నం. తెలంగాణలో కేసీఆర్ లేకపోయినా, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాకపోయినా.. జరిగేది ఇదే.

  • Written By:
  • Publish Date - November 4, 2023 / 04:03 PM IST

KTR: హైదరాబాద్ వచ్చే కంపెనీలకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ (DK SHIVAKUMAR) లేఖలు రాసి కర్ణాటకకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR). హైదరాబాద్‌లోని జలవిహార్‌లో శనివారం జరిగిన తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ (CONGRESS) పార్టీపై, డీకేపై సంచలన ఆరోపణలు చేశారు. “తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న ఫాక్స్‌కాన్ కంపెనీకి డీకే శివ కుమార్ లేఖ రాశారు. కంపెనీ సీఈవోకు లేఖ రాసి.. కంపెనీని బెంగళూరు రావాల్సిందిగా కోరాడు. పోనీ.. ఏదో కంపెనీ కదా ఆశపడ్డాడు అనుకోవచ్చు.

REVANTH REDDY: కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది.. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కోట్లు దోపిడీ: రేవంత్ రెడ్డి

త్వరలో తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందని, ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ బెంగళూరుకు మార్చేస్తాం అని లేఖలో పేర్కొన్నారు. ఇది కర్ణాటక ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ.. కలిసి చేస్తున్న కుటిల ప్రయత్నం. తెలంగాణలో కేసీఆర్ లేకపోయినా, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాకపోయినా.. జరిగేది ఇదే. ఫ్రెండ్లీ ప్రభుత్వం వచ్చాక.. ఇక్కడి కంపెనీలను అక్కడికి తీసుకెళ్తారు. తెలంగాణకు వచ్చే ఉద్యోగాల్ని కూడా బెంగళూరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా మీ నిజాయితీ..? అడ్వకేట్ ట్రస్టును రూ.500 కోట్లకు పెంచుతాం. లాయర్లకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా పెంచుతాం. హైదరాబాద్‌లో ఉంటే.. అమెరికాలో ఉన్నట్లు ఉందని రజినీ కాంత్ అన్నారు. హైదరాబాద్‌లోనే ఇల్లు కట్టుకోవాలనిపిస్తోందని బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అందరికీ కనిపిస్తుంది. కానీ, ప్రతిపక్షాలకు కనిపించడం లేదు. కేసీఆర్ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. కేసీఆర్‌ను ఓడించడానికి అందరూ ఏకం అవుతున్నారు. కేసీఆర్ సింహంలాంటి వారు.

సింగిల్‌గానే వస్తారు. తెలంగాణ సీఎం ఎవరో నిర్ణయించాల్సింది ప్రజలు. మోదీ, రాహుల్ కాదు. ఈ పోరాటం ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్యే జరుగుతోంది. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 24 వేల కొత్త పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయి. కాంగ్రెస్‌కు సీఎంలు దొరికారు. కానీ, ఓటర్లే దొరకడం లేదు. జానారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేడు. కానీ, సీఎం పదవి కావాలి” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.