KTR: 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన ఖర్చుకన్నా.. బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధే ఎక్కువ: కేటీఆర్

60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన ఖర్చు రూ.4.98 లక్షల కోట్లు మాత్రమే. అదే కేసీఆర్‌ ప్రభుత్వం గడిచిన 10 ఏండ్లలో చేసిన ఖర్చు రూ.13,72,930 కోట్లు. ఇది కూడా వాళ్లే చెప్పారు.

  • Written By:
  • Publish Date - December 24, 2023 / 03:14 PM IST

KTR: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పుట్ట.. అంకెల గారడీ అని విమర్శించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్. బీఆర్ఎస్‌పై బురద చల్లేందుకే కాంగ్రెస్.. అబద్ధాలతో శ్వేతపత్రం విడుదల చేసిందన్నారు. దీనికి ప్రతిగా బీఆర్ఎస్.. స్వేద పత్రాన్ని విడుదల చేసింది. పదేళ్లలో బీఆర్ఎస్ సాధించిన ప్రగతిపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Revanth Reddy: ఆటో డ్రైవర్లకు సీఎం గుడ్‌న్యూస్.. ఐదు లక్షల బీమా

స్వేదపత్రం పేరుతో బీఆర్ఎస్ సాధించిన ప్రగతిని వివరించారు.”బీఆర్ఎస్ కేవలం తెలంగాణకు ఆస్తులు సృష్టించిన పార్టీ మాత్రమే కాదు. తెలంగాణ అనే పదానికే అస్థిత్వం తెచ్చి పెట్టిన నాయకుడు కేసీఆర్‌. కాంగ్రెస్‌ తమ 60 ఏండ్ల పాలనలో చేసిన ఖర్చును గంపగుత్తగా వాళ్ల శ్వేతపత్రంలో చూపించింది. కాంగ్రెస్ అరవై సంవత్సరాల పాలనలో తెలంగాణ కోసం రూ.4.98 లక్షల కోట్ల ఖర్చు చేశామని, అది బడ్జెట్‌లో 48.68 శాతమని చెప్పారు. కానీ, వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆదాయాన్ని ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేశారు. 1956లో ఒప్పందం ప్రకారం.. తెలంగాణలోని ఆదాయాన్ని తెలంగాణలోనే ఖర్చు చేయాలి. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. ఆ పని చేయలేదు.

Revanth Reddy: ఆటో డ్రైవర్లకు సీఎం గుడ్‌న్యూస్.. ఐదు లక్షల బీమా

అందువల్లే తెలంగాణలో ఉద్యమం జరిగింది. తెలంగాణవాదుల ఆరోపణల్లో నిజానిజాలు తేల్చడానికి నాటి కేంద్ర ప్రభుత్వం రెండు కమిటీలు వేసింది. ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ లలిత్‌కుమార్‌ కమిటీ, జస్టిస్‌ వశిష్ఠ భార్గవ కమిటీ కూడా తెలంగాణ ఆదాయాన్ని అంధ్రాలో వినియోగించారని చెప్పాయి. ఈ కమిటీ నివేదికను బట్టి తెలంగాణలో రూ.4.98 లక్షల ఖర్చు చేశామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పడం అబద్ధం. నిజంగా అంత ఖర్చు చేసి ఉంటే తెలంగాణలో పరిస్థితి ఇలా ఎందుకు ఉండేది..? తెలంగాణ బిడ్డలు అంతమంది ఎందుకు ప్రాణాలు కోల్పోయేవాళ్లు..? 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన ఖర్చు రూ.4.98 లక్షల కోట్లు మాత్రమే. అదే కేసీఆర్‌ ప్రభుత్వం గడిచిన 10 ఏండ్లలో చేసిన ఖర్చు రూ.13,72,930 కోట్లు. ఇది కూడా వాళ్లే చెప్పారు.

దీని ప్రకారం.. 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిన ఖర్చుకు దాదాపు మూడింతల ఖర్చు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో చేసింది. అయినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదని వాళ్లు అంటున్నారు. కాంగ్రెస్‌ సర్కారు తప్పుడు లెక్కలు చెప్పిందనడానికి ఇదే రుజువు. బీఆర్‌ఎస్‌పై బురదజల్లడమే వాళ్ల లక్ష్యం” అని కేటీఆర్‌ వివరించారు.