మరో ఆరేస్తే ట్రిపుల్ సెంచరీ కుల్దీప్ ను ఊరిస్తున్న రికార్డ్

భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టుకు ముందు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. చెన్నై వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ లో స్పిన్నర్లు కూడా కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి.

  • Written By:
  • Publish Date - September 18, 2024 / 03:22 PM IST

భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టుకు ముందు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. చెన్నై వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ లో స్పిన్నర్లు కూడా కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి. కుల్దీప్‌ మరో ఆరు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఇప్పటివరకు 12 టెస్ట్‌ల్లో 53, 106 వన్డేల్లో 172, 40 టీ20ల్లో 69 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌ యాదవ్ టెస్ట్‌ల్లో 4, వన్డేల్లో 2, టీ20ల్లో 2 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. కుల్దీప్ 300 వికెట్లు పూర్తి చేసుకుంటే ఈ ఘనత సాధించిన 13వ బౌలర్ గా నిలుస్తాడు.