Sri Lanka: బిగినర్స్ మిస్టేక్స్ ఇయన్నీ.. చూసుకోవాలి కదా

ఆసియా కప్‌‌లో గ్రూప్​ దశలోనే వెనుదిరిగే ప్రమాదాన్ని డిఫెండింగ్​ చాంపియన్​ శ్రీలంక తప్పించుకుంది.

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 01:52 PM IST

ఆసియా కప్‌‌లో గ్రూప్​ దశలోనే వెనుదిరిగే ప్రమాదాన్ని డిఫెండింగ్​ చాంపియన్​ శ్రీలంక తప్పించుకుంది. ఆ జట్టును వణికించిన అఫ్గానిస్తాన్‌‌ కొద్దిలో సూపర్‌‌–4 బెర్త్‌‌ను దూరం చేసుకుంది. స్టార్టింగ్‌‌లో అద్భుతంగా ఆడినా ఆఖర్లో తడబడింది. మంగళవారం జరిగిన గ్రూప్​–బి చివరి మ్యాచ్​లో లంక నిర్దేశించిన 292 రన్స్‌‌ టార్గెట్‌‌ను అఫ్గాన్​ 37.1 ఓవర్లలో ఛేజ్​ చేస్తే సూపర్​4 చేరుకునేది. ఛేజింగ్‌‌లో అద్భుతంగా ఆడిన అఫ్గాన్‌‌ 37 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 289 రన్స్‌‌ చేసింది. మరో బాల్‌‌కు మూడు రన్స్‌‌ కొడితే సూపర్​4 బెర్త్​ దక్కేది. కానీ, ఈ బాల్​కు ముజీబుర్‌‌ డకౌట్ గా వెనుతిరిగాడు. మరో మూడు బాల్స్‌‌లో ఆరు రన్స్‌‌ కొడితే టోర్నీలో ముందుకెళ్లే అవకాశం ఉండగా.. ఫజల్‌‌హక్‌‌ కూడా సున్నా పరుగులకే చేతులెత్తేశాడు. దాంతో, 37.4 ఓవర్లలో 289 రన్స్‌‌కు ఆలౌటైన అఫ్గాన్​ 2 రన్స్‌‌ తేడాతో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది.

ఓటమి తప్పించుకున్న శ్రీలంక సూపర్​4 బెర్తు దక్కించుకుంది. మహ్మద్‌‌ నబీ (65), హష్మతుల్లా షాహిది (59), రెహమత్‌‌ షా (45), రషీద్‌‌ (27 నాటౌట్‌‌) గా పోరాడినా అఫ్గాన్​ నెగ్గలేకపోయింది. లంక బౌలర్లలో రజిత 4 వికెట్లు తీశాడు. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 స్కోరు చేసింది. కుశాల్‌‌ మెండిస్‌‌ 84 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 92 పరుగులతో చెలరేగాడు. కుశాల్​ మెండిస్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. గ్రూప్​–ఎ నుంచి ఇండియా, పాక్​. గ్రూప్​–బి నుంచి లంక, బంగ్లాదేశ్ లు సూపర్​–4 చేరుకున్నాయి. మరోవైపు సూపర్‌‌–4, ఫైనల్‌‌ మ్యాచ్‌‌లను హంటన్‌‌టోటాకు తరలించాలని భావించిన ఏసీసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మ్యాచ్‌‌లు కొలంబోలోనే జరుగుతాయి.