Uniform KYC: యునిఫామ్ కేవైసీ.. కేంద్రం కొత్త రూల్..

ప్రతిసారీ డాక్యుమెంట్లు సమర్పించడం.. ఓటీపీలు.. జిరాక్స్‌లు వగైరా పెద్ద తలనొప్పి. ఇకపై ఇలాంటివాటికి చెక్ పడనుంది. ఇకపై అన్నింటికీ కలిపి.. ఒకే కేవైసీ.. అది కూడా ఒక్కసారే చేసేలా కేంద్రం కొత్త చట్టం తీసుకురానుంది.

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 04:12 PM IST

Uniform KYC: కేవైసీ (నో యువర్ కస్టమర్) గురించి అందరికీ తెలిసిందే. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గరినుంచి, క్రెడిట్ కార్డుల జారీ, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు, డీ మ్యాట్ అకౌంట్స్.. ఇలా అనేక ఆర్థిక సంబంధమైన విషయాలలో కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి. అయితే, ఇలా ఫైనాన్సియల్ మేనెజ్‌మెంట్‌కు సంబంధించి ప్రతిసారీ కేవైసీ చేయించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల చాలా మందికి అధిక శ్రమ. ప్రతిసారీ డాక్యుమెంట్లు సమర్పించడం.. ఓటీపీలు.. జిరాక్స్‌లు వగైరా పెద్ద తలనొప్పి.

Poonam Kaur: కనికరం లేదా..? షర్మిలపై పూనం కౌర్‌ సంచలన కామెంట్స్‌

ఇకపై ఇలాంటివాటికి చెక్ పడనుంది. ఇకపై అన్నింటికీ కలిపి.. ఒకే కేవైసీ.. అది కూడా ఒక్కసారే చేసేలా కేంద్రం కొత్త చట్టం తీసుకురానుంది. దీనిపేరు యునిఫామ్ కేవైసీ. ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి యునిఫామ్ కేవైసీని అమలు చేయాలని కేంద్రానికి.. ఫైనాన్స్ స్టెబిలిటీ, డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్‌డీసీ) కీలక ప్రతిపాదనలు చేసింది. కస్టమర్లను ధ్రువీకరించేందుకు ఆర్థిక రంగం అంతటా కేవైసీ రికార్డుల వినియోగాన్ని, అలాగే ఈ ప్రక్రియను డిజిటలైజేషన్‌ను సులభతరం చేసేందుకు యూనిఫామ్ కేవైసీని తీసుకురావాలని ఎఫ్ఎస్‌డీసీ ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాజా ప్రతిపాదనల్ని ప్రభుత్వం ముందుంచుంది. దీనిపై స్పందించిన కేంద్రం.. ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రెటరీ టీవి సోమనాథన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. యూనిఫామ్ కేవైసీ అమలు చేసేందుకు అవసరమైన నిబంధనలపై సూచనలు చేయాలని కోరింది.

దీనివల్ల ప్రతి ఫైనాన్షియల్ అవసరానికి వేర్వేరు కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకు అకౌంట్, డీ మ్యాట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక పరమైన వ్యవహారాలు అన్నింటికీ యునిఫామ్ కేవైసీ ఒక్కసారి చేయిస్తే సరిపోతుంది. నిజానికి.. ఇదే తరహాలో సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ (CKYCR)ని 2016లో ఏర్పాటు చేశారు. కానీ, ఇది కేవలం క్యాపిటల్ మార్కెట్‌కే పరిమితమైంది. దీంతో ఇతర ఆర్థిక వ్యవహారాల్లో కేవైసీ పదేపదే చేయించాల్సి వస్తోంది. అందుకే.. కేంద్రం యునిఫామ్ కేవైసీ దిశగా అడుగులేస్తోంది.