ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న లడ్డు వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీం కోర్టు ప్రారంభం కాగానే మూడో కోర్టులో మొదటి కేసుగా విచారించనుంది జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రచయిత సంపత్ విక్రమ్, ఓ టీవీ ఛానల్ ఎడిటర్ సురేష్ ఖండేరావు చౌహాన్కే దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతోంది.
సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అన్న విషయంపై తన వైఖరి కేంద్రం తెలియజేయనుంది. పార్టీ ఇన్ పర్సన్ గా తన పిటీషన్ పై వాదనను సుబ్రమణ్య స్వామి వినిపిస్తారు. మరో పిటిషనర్ తరఫున కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తారు. టీటీడీ, ఏపి ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్ర, ముకుల్ రోహిత్గి లు వాదనలు వినిపిస్తారు.