ఏపీ ఎక్సైజ్ షాక్, ఒక్క రోజులో ఎన్ని అప్లికేషన్ లు అంటే…!

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నేపధ్యంలో మద్యం దుకాణాలకు పెద్ద ఎత్తున అప్లికేషన్ లు వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - October 4, 2024 / 09:13 AM IST

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నేపధ్యంలో మద్యం దుకాణాలకు పెద్ద ఎత్తున అప్లికేషన్ లు వస్తున్నాయి. ఈ నెల 12 వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో లాటరీ పద్దతిలో షాపులను కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనితో మద్యం షాపుల కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు.

ఇప్పటి వరకు 3 వేల అప్లికేషన్ లు వచ్చాయని ఏపీ ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మద్యం దుకాణా లైసెన్సుల కోసం రెండు రోజుల్లో 3000 అప్లికేషన్లు రాగా మొదటి రోజు 200.. రెండో రోజు 2800 అప్లికేషన్లు వచ్చాయి. అప్లికేషన్ ఫీజు 2 లక్షలు ఉంటుంది. వాటిని తిరిగి చెల్లించరు. ఎవరు ఎన్ని మద్యం దుకాణాలు అయినా నిర్వహించుకోవచ్చు.
.