Traffic Challan: వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్ల గడువు పెంపు..

పండుగ, ఇతర కారణాల వల్ల పలువురు ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేకపోయారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ చలాన్ల రాయితీని జనవరి 31 వరకు పొడిగించారు. రాయితీతో అందే ఈ అవకాశాన్ని వాహనదారులంతా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 08:50 PM IST

Traffic Challan:తెలంగాణలో ప్రభుత్వం.. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించేందుకు రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గడువు నిజానికి జనవరి 10, బుధవారంతో ముగియాలి. కానీ, ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు రాయితీతో ట్రాఫిక్ చలాన్లు చెల్లించవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పండుగ, ఇతర కారణాల వల్ల పలువురు ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేకపోయారు.

Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. దూరంగా ఉండనున్న కాంగ్రెస్..

అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ చలాన్ల రాయితీని జనవరి 31 వరకు పొడిగించారు. రాయితీతో అందే ఈ అవకాశాన్ని వాహనదారులంతా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ రాయితీ ఆఫర్‌కు వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. వాహనదారులు భారీ ఎత్తున పెండింగ్ చలాన్లు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 113 కోట్ల రూపాయలకుపైగా పెండింగ్ చలాన్లు చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. డిసెంబరు 25 వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ ఇచ్చింది. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాల చలాన్లపై 60 శాతం డిస్కౌంట్ ఇచ్చింది.

తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల రికార్డుల ప్రకారం 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 80 లక్షల మందికిపైగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.