MI, Hardik Pandya : పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్.. ముంబై ఫాన్స్ ఫుల్ హ్యాపీ

ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయిదు సార్లు విజేతగా నిలిచి , జట్టులో పలువురు ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నా ఈ సారి అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది.

ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయిదు సార్లు విజేతగా నిలిచి , జట్టులో పలువురు ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నా ఈ సారి అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది. సీజన్ మొత్తంలో కేవలం నాలుగే మ్యాచ్ లు గెలిచింది. తద్వారా పాయింట్ల పట్టికలో చివరి స్థానానికే పరిమతం అయింది.
అయితే ముంబై ఘోర పరాభవం ఫాన్స్ కి మాత్రం సంతోషాన్ని ఇచ్చింది. వాళ్ళు ఎవరో కాదు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యకు ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలను అందించింది.

ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న ఈ కెప్టెన్సీ మార్పు నిర్ణయం‌పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. సీజన్ ఆరంభంలో హార్దిక్‌ను రోహిత్ అభిమానులు హేళన చేశారు. ముంబై ఫ్రాంచైజీపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు రోహిత్ శర్మ‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో ముంబై ఇండియన్స్ జట్టు రెండు గ్రూప్‌లుగా విడిపోయిందని వార్తలు వచ్చాయి. దీనికి తోడు కెప్టెన్ గా హార్దిక్ పాండ్య ఘోరంగా విఫలమయ్యాడు. ఏ మ్యాచ్ లోనూ వ్యక్తిగతంగా కూడా స్థాయికి తగినట్టు ఆడలేక పోయాడు. దీంతో కేవలం రోహిత్ ఫాన్స్ నుంచే కాదు , మాజీ ప్లేయర్స్ నుంచీ కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. చివరికి లక్నో తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లోనూ ఓడి సీజన్ ని ఓటమితో ముగించాల్సి వచ్చింది. దీంతో రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా తొలగించినందుకు ముంబై యాజమాన్యానికి తగిన శాస్తి జరిగిందంటూ హిట్ మ్యాన్ ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.