తాయత్తులను బాగా నమ్మేవాళ్లు ఈ న్యూస్ చూడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది చూసిన తరువాత మీ ఆలోచన మారిపోయే ఛాన్స్ ఉంది. తాయత్తులు కట్టుకుంటే మ్యాజిక్ జరిగిపోతుంది. తలరాత మారిపోతుంది అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు చాలా మంది. తాయత్తులు కట్టేశాం ఇక ఏం కాదు అన్నట్టుగా ఉంటారు. కానీ ఆ తాయత్తులు ప్రాణాలను కాపాడలేవు.. ప్రమాదాలను తప్పించలేవు. యాక్సిడెంట్‌లో చనిపోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nandita)విషయంలో ఇదే రుజువైంది. లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచీ ఆమెను వరుస ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడం. సభకు వెళ్లి వస్తుంటే యాక్సిడెంట్ కావడం.
ఇలా రెండు ప్రాణాపాదాల నుంచి తప్పించుకున్నారు లాస్య. దీంతో ఆమె కుటుంబ సభ్యులు లాస్య కోసం చాలా పూజలు చేశారు. ప్రమాదాల నుంచి బయట పడేందుకు తాయత్తులు కూడా కట్టించారు. అధ్యాత్మికంగా అన్ని ప్రయాత్నాలు చేశారు. కానీ అవేవీ లాస్యను కాపాడలేకపోయాయి. ఫ్రెండ్స్‌తో ఓ ఈవెంట్‌కు వెళ్లి వస్తున్న సమయంలో లాస్యకు యాక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే ప్రణాలు పోయాయి. లాస్య కుటుంబ సభ్యులు చేసిన పూజలు, కట్టించిన తాయత్తులూ ఏవీ లాస్య ప్రాణాలను తిరిగి తీసుకురాలేవు.
యాక్సిడెంట్ జరిగిన సమయంలో లాస్యపై మొత్తం 12 తాయత్తులు ఉన్నాయి. ఆమెకు పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్లు ఆ తాయత్తును రికవర్ చేశారు. వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలాంటి నమ్మకాలు మనుషుల ప్రణాలు కాపాడలేవు అనడానికి లాస్య చావే ఓ ఉదాహరణ. యాక్సిడెంట్ జరిగినప్పుడు లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఆ బెల్ట్ పెట్టుకొని ఉంటే ప్రణాలు దక్కేవి. ఎన్ని తాయత్తులు కట్టుకున్నా ఎన్ని పూజలు చేసినా.. మన జాగ్రత్తే మనల్ని కాపాడుతోంది.