Lasya Nanditha: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృత దేహానికి పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. ప్రమాదం అనంతరం ఆమె డెడ్‌బాడీని పటాన్‌చెరులోని అమేధ హాస్పిటల్‌కు తరలించారు. ఆ తరువాత అక్కడి నుంచి పోస్ట్‌మార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో లాస్య నందిత అంత్యక్రియలు జరగబోతున్నాయి.
YS JAGAN HELICOPTERS: జనం సొమ్ముతో సోకులు.. 4 కోట్లతో రెండు హెలికాప్టర్లు.. జగన్‌పై ఈసీకి కంప్లయింట్
అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంత కుమారికి సూచించారు. గతేడాది ఇదే నెలలో లాస్య తండ్రి కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. అప్పటి ప్రభుత్వం సాయన్నకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదు. మారేడ్‌పల్లిలోని స్మశానంలో సాయన్నకు అంత్యక్రియలు నిర్వహించి సమాధి ఏర్పాటు చేశారు. ఇప్పుడు లాస్య సమాధి కూడా సాయన్న సమాధి పక్కనే ఏర్పాటు చేయబోతున్నారు. లాస్య మృతి విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు హాస్పిటల్‌కు వెళ్లారు. జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. లాస్య మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన తరువాత.. మాజీ సీఎం కేసీఆర్ లాస్య ఇంటికి వెళ్లారు. ఆమెకు నివాళి అర్పించారు. ఇవాళ సాయంత్రం వరకూ లాస్య డెడ్‌బాడీని వాళ్ల ఇంటిదగ్గరే ఉంచబోతున్నారు.
సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఇక లాస్య పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడించారు డాక్టర్లు. లాస్యకు ఇంటర్నల్ ఇంజూరీస్ తీవ్రంగా ఉన్నట్టు గుర్తించారు. యాక్సిండెంట్ జరిగిన వెంటనే లాస్య రిబ్స్ విరిగిపోయాయని.. యాక్సిడెంట్ తీవ్రతకు పళ్లు కూడా ఊడిపోయాయని చెప్పారు. ఇంత తీవ్ర స్థాయిలో యాక్సిడెంట్ జరిగింది కాబట్టే అక్కడిక్కడే లాస్య చనిపోయిందంటూ చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే లాస్య ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.