Lasya Nanditha: ఆకాశ్‌కు డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ టెస్ట్‌.. లాస్య కేసులో ఏం జరగబోతోంది..

కారు నడిపేప్పుడు డ్రైవర్‌ ఆకాశ్‌ మద్యం తాగి ఉన్నాడా లేదా అనే దానిపై పోలీసులు ఆరా తీయబోతున్నారు. దీనికి సంబంధించి ఆకాశ్ బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షలకు పంపించారు. ఇక అతని ఫోన్ కాల్ డేటా కూడా సేకరిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 05:05 PM IST

Lasya Nanditha: కంటోన్మెంట్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంలో చాలా అనుమానాలకు ఇంకా సమాధానం దొరకలేదు. కుటుంబంతో పూజలు చేసి.. ఆకాశ్‌తో కలిసి నందిత వేరుగా ఎందుకు ట్రావెల్‌ చేశారు.. అసలు ఆ ఐదు గంటలు ఏం జరిగింది.. ప్రమాదానికి వేగం మాత్రమే కాదు.. మరో కారణం ఏమైనా ఉందా.. ఆకాశ్ కారు నడిపేప్పుడు మద్యం తాగి ఉన్నాడా.. ఇలా రకరకాల కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హై ప్రొఫైల్‌ కేసు కావడంతో.. మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు.

TDP-BJP: కమలంతో దోస్తీ.. ఏపీలో బీజేపీకి టిక్కెట్లు ఎన్ని..?

కారు నడిపేప్పుడు డ్రైవర్‌ ఆకాశ్‌ మద్యం తాగి ఉన్నాడా లేదా అనే దానిపై పోలీసులు ఆరా తీయబోతున్నారు. దీనికి సంబంధించి ఆకాశ్ బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షలకు పంపించారు. ఇక అతని ఫోన్ కాల్ డేటా కూడా సేకరిస్తున్నారు. ఏ చిన్న విషయం కూడా మిస్ కాకుండా.. పోలీసులు పక్కాగా విచారణ జరుపుతున్నారు. ప్రమాదంలో గాయలపాలై ఆసుపత్రిలో చేరిన ఆకాశ్‌ను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. ప్రమాదం ఎలా జరిగిందని ఎన్నిమార్లు, ఎలా ప్రశ్నించినా.. ఏం జరిగిందో.. ఎలా జరిగిందో గుర్తులేదు అంటూ ఆకాశ్ చెప్పుకొచ్చాడని తెలుస్తోంది. అతని నోటి వెంట అదొక్క మాట తప్ప.. మరే వివరాలూ రాలేదని పోలీసులు అంటున్నారు.

ఇప్పటికే మెజిస్ట్రేట్‌ ఎదుట ఆకాశ్‌ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. అన్నీ రికార్డ్ చేసి పెట్టి ఉంటారు. ఐతే ఆకాశ్ బ్లడ్ శాంపిల్స్‌లో మద్యం ఆనవాళ్లు ఉన్నాయా లేదా అన్నది క్లారిటీ వచ్చాక.. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఐతే ప్రమాదం జరిగిన తీరు.. డ్రైవర్ సమాధానాలతో.. నిద్రమత్తే ప్రమాదానికి కారణం అని పోలీసులు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.