BRS Cantonment: కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత.. సొంత పార్టీలోనే వ్యతిరేకత! నివేదితను గెలవనిస్తారా

పేరుకు ఎమ్మెల్యే ఐనా.. కంటోన్మెంట్‌ స్థానంలో చాలా వ్యతిరేకత మూటగట్టుకున్నారు సాయన్న. ఇది కొందరు వ్యక్తుల నుంచి ఉంటే ఓకే.. కానీ బీఆర్ఎస్‌లోని స్థానిక నాయకులు నుంచి కూడా ఆయకు తీవ్ర వ్యతిరేకత ఉండేదని టాక్‌.

  • Written By:
  • Publish Date - April 10, 2024 / 05:58 PM IST

BRS Cantonment: కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున లాస్య నందిత సోదరి నివేదిత పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా బీఆర్ఎస్ ప్రకటించింది. కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో వచ్చే నెలలో కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగబోతుంది. పార్లమెంట్ ఎన్నికతోపాటే.. అసెంబ్లీకి ఎన్నిక జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి విషయంలో కొద్ది రోజులుగా సందేహాలు తలెత్తాయి.

AAP minister Raaj Kumar: ఆప్ మంత్రి రాజీనామా.. కేజ్రీవాల్‌ పతనం మొదలైందా..?

అనేక చర్చలు, నివేదికల తర్వాత లాస్య సోదరి నివేదితకు టిక్కెట్ ఖరారు చేసింది అధిష్టానం. అయితే, ఇక్కడే నివేదితకు ఎదురవుతున్న పెద్ద సమస్య.. ఆ ప్రాంతంలో ఉన్న వ్యతిరేకత. పేరుకు ఎమ్మెల్యే ఐనా.. కంటోన్మెంట్‌ స్థానంలో చాలా వ్యతిరేకత మూటగట్టుకున్నారు సాయన్న. ఇది కొందరు వ్యక్తుల నుంచి ఉంటే ఓకే.. కానీ బీఆర్ఎస్‌లోని స్థానిక నాయకులు నుంచి కూడా ఆయకు తీవ్ర వ్యతిరేకత ఉండేదని టాక్‌. సాయన్న చనిపోయిన తరువాత అదే స్థానం నుంచి లాస్య నందితను నిలబెట్టారు కేసీఆర్‌. ఆమె పోటీ చేసిన సమయంలో కూడా పార్టీ నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. పార్టీ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్నవాళ్లను కాదని వాళ్ల కుటుంబానికే టికెట్‌ ఎలా ఇస్తారంటూ చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు గ్రూపుగా ఏర్పడి లాస్యను గెలవనివ్వకుండా క్యాపెయిన్‌ కూడా చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. కానీ ఆ ఎన్నికల్లో మాత్రం లాస్య గెలిచారు. రీసెంట్‌గా ఆమె కూడా చనిపోవడంతో ఇప్పుడు మళ్లీ అదే కుటుంబం నుంచి నివేదితకు టికెట్‌ ఇస్తామని ప్రకటించారు కేసీఆర్‌. దీంతో ఇప్పుడు అసంతృప్తిగా ఉన్న కేడర్‌ నివేదితకు సహకరిస్తారా.. అసలు బీఫామ్‌ ఆమె చేతిదాకా వెళ్లనిస్తారా అనేది పెద్ద క్వశ్చన్‌మార్క్‌గా మారింది.

ఇప్పటికే బీఆర్ఎస్‌పై అసంతృప్తిగా ఉన్న చాలా మంది నేతలను కాంగ్రెస్‌ తనలో కలుపుకుంది. దానికి తోడు ఇప్పుడు ప్రభుత్వం కూడా మారిపోయింది. అన్నిటికీ మించి అదే కుటుంబానికి మళ్లీ టికెట్‌ అంటూ కేసీఆర్‌ ప్రకటించారు. ఇవన్నీ చూస్తే కంటోన్మెంట్‌లో నివేదిత గెలవడం కష్టమే అనే వాదనలే ఎక్కువగా వినిస్తున్నాయి. జనరల్‌ ఎన్నికలతో కంపేర్‌ చేస్తే బైపోల్‌లో పరిస్థితి వేరుగా ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్లు సీటు దక్కించేందుకు సామ దాన బేద దండోపాయాలు ఉపయోగిస్తారు. వాళ్ల వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నడమే పెద్ద సమస్య అనుకుంటే.. పార్టీలో కనిపిస్తున్న వ్యతిరేకత ఇప్పుడు మరో తలనొప్పిగా మారింది. తండ్రి, అక్కను కోల్పోయిన సెంటిమెంట్‌తో నివేదిత అసెంబ్లీలో అడుగు పెడుతుందా.. లేదా కాంగ్రెస్‌ వ్యూహాలు, పార్టీ వ్యతిరేకుల చేతిలో బీఆర్ఎస్‌ చిత్తు అవుతుందా చూడాలి.