SALMAN KHAN: సల్మాన్‌ను లారెన్స్‌ గ్యాంగ్‌ ఎందుకు చంపాలనుకుంటోంది..?

సల్మాన్‌కు లారెన్స్‌కు మధ్య వివాదమేంటి అనేదే ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్‌. మర్డర్‌, వెపన్‌ డీలింగ్‌ లాంటి దాదాపు 25 క్రిమినల్‌ కేసులు ఉన్న లారెన్స్‌ బిష్ణోయ్‌కి సల్మాన్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి సబంధం లేదు. కానీ గతంలో సల్మాన్‌ జింకలను వేటాడటం ఆయనకు ఇప్పుడు ఈ ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది.

  • Written By:
  • Updated On - April 16, 2024 / 01:42 PM IST

SALMAN KHAN: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ను లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఇంకా వెంటాడుతోంది. చాన్స్‌ దొరికితే ఖాన్‌ను ఖతం చేసేందుకు ట్రై చేస్తోంది. ముంబైలోని బాంధ్రాలో.. సల్మాన్‌ ఖాన్‌ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ మీద ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. 5 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. నాలుగు ఖాళీ షెల్స్‌ను స్పాట్‌లో గుర్తించారు పోలీసులు. ఓ బెలెట్‌ను సల్మాన్‌ ఖాన్‌ ఇంటి బాల్కనీలో గుర్తించారు. ఈ ఇన్సిడెంట్‌ జరిగిన సమయంలో సల్మాన్‌ ఇంట్లోనే ఉన్నాడు.

JANASENA GLASS: జనసేనకే గాజు గ్లాసు.. హైకోర్టులో బిగ్ రిలీఫ్

బాల్కనీ దాకా బుల్లెట్స్‌ వెళ్లడంతో ఈ ఇష్యూను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరు నిందుతులు వికీ గుప్తా, సాగర్‌ పాల్‌ను గుజరాత్‌లో అరెస్ట్‌ చేశారు. ఇది జరిగిన కాసేపటికే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ తమ్ముడు అన్మోల్‌ బిష్ణోయ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇది జస్ట్‌ ట్రయల్‌ మాత్రమే అని.. అసలు సినిమా ముందుంది అంటూ పోస్ట్‌ చేశాడు. అసలు సల్మాన్‌కు లారెన్స్‌కు మధ్య వివాదమేంటి అనేదే ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్‌. మర్డర్‌, వెపన్‌ డీలింగ్‌ లాంటి దాదాపు 25 క్రిమినల్‌ కేసులు ఉన్న లారెన్స్‌ బిష్ణోయ్‌కి సల్మాన్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి సబంధం లేదు. కానీ గతంలో సల్మాన్‌ జింకలను వేటాడటం ఆయనకు ఇప్పుడు ఈ ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. బిష్ణోయ్‌ కమ్యూనిటీలో కృష్ణజింకలను పవిత్ర జీవులుగా భావిస్తారు. దేవతలతో సమానంగా వాటిని పూజిస్తారు. అలాంటి కృష్ణజింకలను సల్మాన్‌ఖాన్‌ వేటాడటంతో.. సల్మాన్‌ మీద కోపం పెంచుకున్నారు లారెన్స్‌ గ్యాంగ్‌.

ఈ ఇష్యూలో సల్మాన్‌ జైలులో ఉన్న సమయంలోనే సల్మాన్‌ను చంపేస్తామంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. సింగర్‌ సిద్ధూ మూసేవాలా మర్డర్‌ జరిగినప్పుడు కూడా లారెన్స్‌ గ్యాంగ్‌ మరోసారి తెరమీదకు వచ్చారు. అప్పుడు కూడా లారెన్స్‌ మరోసారి సల్మాన్‌ పేరు మీడియా ముందు చెప్పారు. సిద్ధూ మర్డర్‌తో తనకు సంబంధం లేదని.. కానీ సల్మాన్‌ను మాత్రం ఖచ్చితంగా చంపి తీరుతామంటూ చెప్పాడు. ఆ తరువాత సల్మాన్‌కు సెక్యూరిటీ కూడా పెంచారు. సల్మాన్‌ బుల్లట్‌ప్రూఫ్‌ కారు కూడా తీసుకున్నాడు. కొన్ని రోజులు సైలెంట్‌గానే ఉన్నా.. ఇప్పుడు మరోసారి కాల్పులతో అలజడి సృష్టించారు లారెన్స్‌ గ్యాంగ్‌.