తెలుగు రాష్ట్రాల్లో చాలా సార్లు అడవీలో ఉండల్సిన జంతువులు జనావాసాల మధ్య లోకి వస్తున్నాయి. అవి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకున్నాం.. కానీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇదే దుస్తితి.. అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు నగరంలోకి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని టాటా పవర్ కాంప్లెక్స్‌లోకి చిరుత పులి వచ్చిన ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర (Maharashtra) లోని కళ్యాణ్-ముర్బాద్ రో (Kalyan-Murbad Road) లోని వరప్ గ్రామ సమీపంలో ఉన్న టాటా పవర్ కంపెనీ (Tata Power Company) ఆవరణలో చిరుతపులి సంచరిస్తూన్న దృశ్యాలు సీసీ కెమెరా కంటికి చిక్కింది. చిరుతపులి రాకతో టాటా పవర్ కంపెనీ ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనలు చెందారు. కంపెనీ ఉద్యోగులు చిరుతపులి గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రాత్రి వేళల్లో చిరుతను బంధించేందుకు ప్రయత్నించిన చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ చిరుత పులి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
చిరుతపులి సంచారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుతపులి అడవిలో దారి తప్పి జనావాస ప్రాంతానికి వచ్చిందని అటవీశాఖ అధికారులు చెప్పారు. కళ్యాణ్-ముర్బాద్ రోడ్‌లోని వరప్ గ్రామ వాసులు,టాటా పవర్ కంపెనీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.