Twitter X: కంటెంట్‌ క్రియేటర్లకు 116 కోట్లు.. ట్విటర్‌ మరో సంచలన నిర్ణయం..

ఎప్పటికప్పు కొత్త నిర్ణయాలు కొత్త అప్‌డేట్స్‌తో యాజర్స్‌ను థ్రిల్‌ చేస్తున్న ట్విటర్‌ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 01:02 PM IST

ఎప్పటికప్పు కొత్త నిర్ణయాలు కొత్త అప్‌డేట్స్‌తో యాజర్స్‌ను థ్రిల్‌ చేస్తున్న ట్విటర్‌ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్విటర్‌లో కంటెంట్‌ ఇచ్చే క్రియేటర్లకు నగదు చెల్లిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ క్రియేటర్లకు 116 కోట్లు చెల్లించినట్టు ట్విటర్‌ ప్రకటించింది. క్రియేటర్లను ప్రోత్సహించేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్‌ సీఈవో లిండా చెప్పారు. మంచి కంటెంట్‌ అందించే ప్రతీ ఒక్కరికీ ఇప్పటి నుంచి ట్విటర్‌ డబ్బు చెల్లిస్తుందని చెప్పారు. మంచి కంటెంట్‌ను ప్రజలకు అందించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ట్విటర్‌ నుంచి డబ్బు రిసీవ్‌ చేసుకున్న చాలా మంది సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

ఎలాన్‌ మస్క్‌ చేతికి ట్విటర్‌ వచ్చిన తరువాత సంస్థలో చాలా మార్పులు చేస్తున్నారు మస్క్‌. ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే ఉండే బ్లూ టిక్‌ను ఇప్పుడు పెయిడ్‌ అకౌంట్స్‌ అన్నిటికీ ఇస్తున్నారు. వాయిస్‌ కాలింగ్‌ కూడా పరిచయంచేయబోతున్నట్టు ప్రకటించారు. అన్నిటికంటే ముఖ్యంగా ట్విటర్‌ లోగోను మార్చేశారు. ఇప్పుడు క్రియేటర్లకు డబ్బులు ఇస్తూ కంటెంట్‌ క్రియేటర్స్‌లో మరింత ఉత్సాహాన్ని కలిగించేందుకు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రముఖ సోషల్‌ ప్లాట్‌ఫాం.. ఫేస్‌బుక్‌ కూడా తన కంటెంట్‌ క్రియేటర్లకు డబ్బులు చెల్లిస్తోంది ఇప్పుడు ట్విటర్‌ కూడా అదే రూట్‌ ఫాలో అవ్వబోతోంది. ఇలాంటి కొత్త నిర్ణయాలు ఇంకా ఎన్ని తీసుకుంటారో చూడాలి.