తెలంగాణలో చుక్క పడటం లేదు. లిక్కర్ షాపుల్లో మందు దొరకడం లేదు. రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి దుకాణాలకు లిక్కర్ సరఫరా నిలిచిపోయింది. కొద్ది రోజులుగా లిక్కర్ సప్లై తగ్గిపోయిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదిలాగే కొనసాగితే.. వైన్‌షాపుల్లోనూ స్టాక్ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయం తెలిసి కొందరు, ముందుగానే వైన్ షాపుల కెళ్ళి లిక్కర్ కొని స్టాక్ పెట్టుకుంటున్నారు. ఆ పని చేయలేని వాళ్ళు రేపు ఎలాగా అనే భయం లో గిలగిలా కొట్టుకుంటున్నారు.
మద్యం అమ్మకాల్లో తెలంగాణ, దేశంలోనే నెంబర్ వన్. భారత్ లో సగటున ఒక వ్యక్తి లిక్కర్ కోసం చేసే ఖర్చులో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది.2022. 23లో తెలంగాణలో యావరేజ్ గా ఏడాదికి ఒక వ్యక్తి 1623 రూపాయలు లిక్కర్ కోసం ఖర్చు పెడుతున్నాడు. ఏపీలో అయితే ఒక వ్యక్తి ఏడాదికి మద్యం కోసం 13 6 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నాడు. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ 1245 రూపాయలు, చతిస్గడ్ 1227 రూపాయలతో దూసుకుపోతున్నాయి. మందు కొట్టడంలో తెలంగాణ. కొన్నేళ్లుగా హైదరాబాదును గాని, తెలంగాణను గాని మందు కొట్టడంలో మరి ఏ రాష్ట్రం బీట్ చేయలేకపోయింది. కింగ్ ఫిషర్, మెక్డోల్స్, టూ బర్గ్ లు హైదరాబాద్ తెలంగాణలో చాలా పాపులర్ బ్రాండ్స్. అలాంటి తెలంగాణలో సాంకేతిక కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం డిపోల్లో లిక్కర్ సరఫరా బంద్ అయింది. వైన్ షాపులకు మద్యం సరఫరా చేసేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సర్వర్ స్తంభించి… రాష్ట్రం మొత్తం లిక్కర సప్లైకు బ్రేకులు పడ్డాయి. లిక్కర్ ఆర్డర్ తో డిడిలు కట్టి డిపోలకు వెళ్లిన డీలర్లకు సర్వర్ స్తంభించడంతో..మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజుల నుంచి సర్వర్ స్తంభించడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 మద్యం డిపోల ద్వారా ప్రతిరోజు సుమారుగా 100 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి.
రాష్ట్రంలో మద్యం సరఫరా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరుగుతోంది. డీలర్లకు వేగంగా లిక్కర్ సరఫరాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద ఎంత సరుకు ఉంది, డీలర్లు ఎంత తీసుకెళ్లారో స్పష్టంగా తెలిసేందుకు అధికారులు ఈ ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చారు. పూర్తి పారదర్శకంగా ఉన్న ఈ పద్ధతి ..అటు అధికారులకు, ఇటు డీలర్లకు ఉపయోగకరంగా ఉంది. అయితే అకస్మాత్తుగా సాంకేతిక లోపంతో సర్వర్ సమస్య తలెత్తడంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను వేగంగా పరిష్కరించాలని అబ్కారీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా సర్వర్‌ను రీస్టోర్ చేసే పనుల్లో అధికారులు ఉన్నారు. సర్వర్ సమస్య వల్ల ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో భారీగా లిక్కర్ సమస్య రాకపోయినా… ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం మందు బాబులకు కష్టకాలమే. కార్తీకమాసం గనక కొందరు లిక్కర్ , నాన్ వెజ్ తీసుకోరు.
కానీ శీతాకాలం మొదలైంది. దీంతో హాట్ డ్రింక్స్ కి ఇంకా డిమాండ్ ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా బీర్ కి హైదరాబాద్ కి ఉన్న సంబంధం తెలియనిది కాదు. కాలంతో సంబంధం లేకుండా హైదరాబాద్ జనం బీర్లు కొట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్కసారిగా లిక్కర్ కొరత వచ్చేయడంతో మందుబాబులు బింబెలెత్తిపోతున్నారు. మొన్నటి వరకు మంచి లిక్కర్ లేక అల్లాడిపోయిన ఏపీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల బ్రాండ్లతో కలకలలాడిపోతుంది. మన రాష్ట్రానికి ఈ కర్మ ఏంటి? అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు మందుబాబులు .ఒకపక్క శీతాకాలం… మరోపక్క క్రిస్మస్ న్యూ ఇయర్ దగ్గరికి వచ్చేస్తున్నాయి.పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఏంటి ? అనే ఆందోళనలో ఉన్నారు. త్వరగా సర్వర్ సమస్య ఏంటో పరిష్కరించండి రా బాబు అని వేడుకుంటున్నారు. ఇలాంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండే మరి కొంతమంది ముందుగానే స్టాక్ కొన్ని ఇంట్లో దాచుకుంటున్నారు.