మందుబాబులకు బిగ్ షాక్… ఇవాళ హైదరాబాద్ లో మధ్యం షాపులు బంద్. హైదరాబాద్ లోలాల్ దర్వాజ అమ్మవారి బోనాల జరుగుతుండ సందర్భంగా HYD నగర వ్యాప్తంగా నేడు, రేపు మద్యం షాపులు మూసేయాలని అధికారులు ఆదేశించారు. ఈరోజు ఉ.6 గంటల నుంచి ఎల్లుండి అంటే ఈ నెల 30న ఉ.6 గంటల వరకు షాపులు మూసే ఉంటాయి. మరోవైపు సైబరాబాద్ పరిధిలో ఈరోజు నుంచి రేపు ఉ.6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.
కాగా నేడు లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల మహోత్సవం ఘనంగా జరగనుంది. ఆషాడ మాసంలో మూడో ఆదివారం లో నిర్వహించే ప్రధాన ఆలయం లాల్ దర్వాజా ఆలయం. కాగా ఆదివారం ఉదయం నుంచే లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లాల్ దర్వాజ టెంపుల్ వైపు వచ్చే వాహనాలకు చాంద్రాయణగుట్ట, కందికల్ గేట్ ఉప్పుగూడ నుంచి వచ్చే వాహనాలకు అనుమతి లేదు. హిమ్మత్‌పురా, షంషీర్‌గంజ్ వైపు నుంచి లాల్ దర్వాజాకు వచ్చే వాహనాలను నాగుల చింత, గౌలిపురా వైపు ట్రాఫిక్ పోలీసులు మళ్లించారు.