Kangana Ranaut: లోక్‌సభ ఎన్నికల్లో కంగనా.. ఆ పార్టీ నుంచే పోటీ..

చాలామంది సినీ తారలకు, కొత్తవారికి అవకాశం ఇస్తోంది. ఇటీవలే సీనియర్ హీరోయిన్ రాధికకు.. తమిళనాడు టిక్కెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మరికొందరు సినీ, క్రీడా ప్రముఖుల్ని కూడా బీజేపీ బరిలోకి దింపబోతుంది.

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 05:46 PM IST

Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్, ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగనుంది. కంగనా తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ నుంచి, బీజేపీ తరఫున పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. హిమాచల్​ ప్రదేశ్‌లోని​ మండీ లోక్​సభ సీటు నుంచి కంగనాను పోటీ చేయించాలని కమల దళం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలని లక్ష‌్యంగా పెట్టుకున్న బీజేపీ.. గెలుపు గుర్రాలను వెతుకుతోంది.

YSRCP MLA’S: వైసీపీ ఎమ్మెల్యేలు జంప్.. బీజేపీలో చేరిన గూడూరు ఎమ్మెల్యే

చాలామంది సినీ తారలకు, కొత్తవారికి అవకాశం ఇస్తోంది. ఇటీవలే సీనియర్ హీరోయిన్ రాధికకు.. తమిళనాడు టిక్కెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మరికొందరు సినీ, క్రీడా ప్రముఖుల్ని కూడా బీజేపీ బరిలోకి దింపబోతుంది. ఈ స్ట్రాటజీ ప్రకారమే.. కంగనా రనౌత్ పేరు పరిశీలిస్తోంది. నిత్యం వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచే కంగనాకు రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఆమె బీజేపీకి, హిందూత్వకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. గతేడాది మీడియాతో మాట్లాడుతూ.. ‘శ్రీ కృష్ణుడి ఆశిస్సులు ఉంటే.. వచ్చే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తాను’ అన్నారు. మోదీపై కూడా అభిమానాన్ని చాటుకుంటారు.

జనవరి 22న, జరిగిన రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా కంగనా పాల్గొన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న కంగనాను.. ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ నుంచి బరిలో దింపితే గెలుపు ఖాయమని బీజేపీ లెక్కలు వేస్తోంది. కంగనా పోటీపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.