Madhavilata : పోలింగ్ కేంద్రంలో మాధవీలత హల్ చల్.. మాధవీలతపై కేసు నమోదు

హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ BJPఅభ్యర్థి మాధవీలత పోలింగ్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. ఓటు వేయడానికి వచ్చే ప్రతిఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పలువురి ఓటర్ల ముఖాలను స్వయంగా ఆమె తనిఖీ చేశారు. ఆమె తీరుపై పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక మరి కొందరు ఒక ఎంపీ అభ్యర్థికి పోలింగ్ కేంద్రంలో ఏం పిన ఉందని ప్రశ్నిస్తున్నారు. కాగా హైదరాబాద్ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి మాధవిలత పోటీ చేస్తుంది. అజంపుర, గోషామహల్ లో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీరియస్ అయ్యారు. దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా ఓటు వేసేందుకు క్యూలో ఉన్న ముస్లిం మహిళల ముఖాలకు ఉన్న బుర్కను తీసి మాదవీలత స్వయంగా ముఖాలను తనిఖీ చేసింది. దీంతో పోలింగ్ బూత్ లో ఆమె వ్యవహరించిన తీరుపై.. ఆమెపై కేసు నమోదు చేయాలని ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు.

Suresh SSM