చిన్న సినిమాకు మహేష్ షార్ట్ అండ్ స్వీట్ ట్యాగ్ లైన్

టాలీవుడ్ లో మంచి సినిమాలు ఏవి వచ్చినా సరే సూపర్ స్టార్ మహేష్ బాబు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో వాటిని కొనియాడుతూ ఉంటారు. సినిమా తనకు నచ్చితే చాలు ఆయన నుంచి వెంటనే ఎక్స్ లో పోస్ట్ వచ్చేస్తుంది.

  • Written By:
  • Publish Date - September 1, 2024 / 12:37 PM IST

టాలీవుడ్ లో మంచి సినిమాలు ఏవి వచ్చినా సరే సూపర్ స్టార్ మహేష్ బాబు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో వాటిని కొనియాడుతూ ఉంటారు. సినిమా తనకు నచ్చితే చాలు ఆయన నుంచి వెంటనే ఎక్స్ లో పోస్ట్ వచ్చేస్తుంది. ఇటీవల నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా మహేష్ కు ఎంతగానో నచ్చడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభినందించారు. ఇలా కొన్ని సినిమాలను పొగడటం తనకు టైం దొరికితే వెళ్లి ఆ సినిమాలు చూడటం చేస్తూ ఉంటారు మహేష్ బాబు. ఇలా చిన్న సినిమాలకు ఆయన నుంచి ఆదరణ వస్తుంది.

అయితే ప్రముఖులు నిర్మించిన సినిమాలనే ఆయన ప్రమోట్ చేస్తూ ఉంటారనే విమర్శలను మహేష్ బాబు పెద్దగా పట్టించుకోరు. తాజాగా ఆయనకు మరో సినిమా నచ్చేసింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పణలో వచ్చిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఎంతగానో ఆకట్టుకుంది ప్రేక్షకులను. ఆ సినిమా మహేష్ బాబుకి కూడా ఎంతగానో నచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన వినోదాత్మక చిత్రాల్లో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ఒకటని మహేష్ బాబు ఎక్స్ లో పోస్ట్ చేసారు.

అలాగే ఈ సినిమాకు తనదైన శైలిలో స్వీట్ ట్యాగ్ లైన్ ఒకటి ఇచ్చేసారు. ‘హిలేరియస్ రైడ్’ అంటూ సినిమాకు షార్ట్ గా మంచి ట్యాగ్ లైన్ ఇచ్చి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు ఈ ట్వీట్ ని చిత్ర యూనిట్ వైరల్ చేస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు… రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటి వరకు ఫ్యాన్స్ కు కనపడని లుక్ లో కనపడుతున్నారు. జుట్టు పెంచి గడ్డంతో మహేష్ బాబు కనపడతారని తెలుస్తోంది. ఇటీవల దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.