Mallikarjun Kharge : సీఎం కేసీఆర్‌కి అహంకారం.. ఇందిరమ్మపైనే విమర్శలా ?: మల్లిఖార్జున ఖర్గే

ఫామ్ హౌస్ లో కూర్చుని పాలించే కేసీఆర్ కు పేదల బాధలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు AICC చీఫ్ మల్లిఖార్జున ఖర్గే. ఇందిరమ్మ విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదన్నారు.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 07:26 PM IST

MALLIKARJUN KHARGE : అహంకార సీఎం కేసీఆర్‌ను అధికారం నుంచి దింపాలని నల్గొండ ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. నల్గొండ చేరుకున్న ఆయన.. మొదట ఫ్లోరైడ్‌తో పోరాడి చనిపోయిన అంశల స్వామికి నివాళులు అర్పించారు. తర్వాత బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇందిరమ్మ మహానేత.. ఆమెపై కేసిఆర్ చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నానన్నారు. నాగార్జున సాగర్ లాంటి గొప్ప ప్రాజెక్ట్ ని ఇందిరాగాంధీ నిర్మించారని ఖర్గే గుర్తు చేశారు.

REVANTH REDDY: రైతులను ఆదుకుంటామని చెప్పి కేసీఆర్ మాట తప్పాడు: రేవంత్ రెడ్డి

సాగర్ నిర్మాణం జరగకపోతే వరి సాగుకు తెలంగాణ ధాన్యాగారం అయ్యేదా? అని ప్రశ్నించారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చిందే ఇందిరమ్మ అని ఖర్గే తెలిపారు. గరీబీ హఠావో పేరుతో పేదలను ఆదుకున్న ఆమెను విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీదా లక్షా 40 వేల రూపాయలు కేసీఆర్ అప్పు చేసి పెట్టాడనీ.. పుట్టబోయే బిడ్డ నెత్తిన కూడా అప్పు ఉందన్నారు ఖర్గే. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని పాలిస్తున్నావు. 2018లో నువ్వు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. ఏ ఒక్కటీ పూర్తి చేయలేదని మండిపడ్డారు ఖర్గే. ఢిల్లీకి బీజేపీ, హైదరాబాద్‌కు బీఆర్ఎస్ ఒక్కటే.. మోడీ, కేసిఆర్ పాలనలో పేదల జీవితాలు దుర్భరంగా మారాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్రమోడీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు తోడు దొంగలేనని వ్యాఖ్యానించారు ఖర్గే. దేశంలో ఉన్న 3 పత్రికలకు చెందిన దాదాపు 780 కోట్లను బీజేపీ ప్రభుత్వం జప్తు చేసింది. ఈ మూడు పత్రికలూ నెహ్రూ సొంత ఆస్తి.

ఆయన స్థాపించిన ఈ పత్రికలే స్వాతంత్య్ర పోరాటానికి ఉపయోగపడ్డాయన్నారు ఖర్గే. తెలంగాణ ప్రజలు ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపించే తీరు భారతదేశం మొత్తం ప్రతిబింబిస్తుందన్నారు. నిరుపేదలను ఆదుకోవడంలో బీజేపీ, బీఆర్ఎస్ నిర్లక్షం చేస్తున్నాయని విమర్శించారు.