Indira Kranthi Scheme: మహిళలకు వడ్డీ లేని రుణాలు.. వారికీ రైతు బంధు: భట్టి విక్రమార్క

ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు అందించాలని నిర్ణయించాం. దీని ద్వారా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి రుణాలిస్తాం. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే రైతు బంధు ఇస్తున్నాం.

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 06:35 PM IST

Indira Kranthi Scheme: తెలంగాణలో ప్రతి మహిళను మహాలక్ష‌్మిగా భావిస్తామని, మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు అందిస్తామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వడ్డీ లేని రుణాలందించే ఇందిరా క్రాంతి పథకాన్ని ఈ నెల 12న ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని హైదరాబాద్‌లో భట్టి వెల్లడించారు. “ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు అందించాలని నిర్ణయించాం.

PAWAN KALYAN: పవన్ కల్యాణ్ మరో త్యాగం.. నాగబాబుకు దెబ్బేనా.. జనం ఏమనుకుంటున్నారు..

దీని ద్వారా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి రుణాలిస్తాం. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే రైతు బంధు ఇస్తున్నాం. వ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇస్తాం. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నప్పటికీ.. త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి కూడా రైతు బంధు ఇస్తాం. రాష్ట్రంలో వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు. విద్యుత్ చార్జీలు పెంచబోవడం లేదు. విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గృహజ్యోతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎప్పుడూ మొదటి వారంలో జీతాలు అందలేదు.

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్చి 1నే జీతాలు ఇచ్చాం. కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులను నిరర్థక ఆస్తులుగా వదిలేయం. త్వరలో విద్యుత్ పాలసీని తీసుకువస్తాం. ఏప్రిల్, మే నెలల్లో 16 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశాం. విద్యుత్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికతో ముందుకు వెళ్తాం. వేసవిలో విద్యుత్ కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 40,33,702 జీరో బిల్లులు ఇచ్చాం” అని భట్టి విక్రమార్క వెల్లడించారు.