Telangana Congress: ఐదేళ్లుగా రైతు రుణమాఫీ అమలు చేయని రైతు వ్యతిరేక కేసీఆర్ అని, ఎన్నికల కోసమే రైతు బంధు డ్రామా ఆడుతున్నారని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాగమయిని గెలిపించాలని ప్రచారం చేశారు. భట్టితోపాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రజల సంపదను 10 సంవత్సరాలుగా పందికొక్కుల్లా తిన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, రుణమాఫీ ఇవ్వదనడానికి కేసీఆర్, కేటీఆర్‌కు బుద్ధి ఉండాలి.
Revanth Reddy’s open letter : స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ఐదు సంవత్సరాలుగా రుణమాఫీ అమలు చేయని రైతు వ్యతిరేకి కేసీఆర్. ఎన్నికల కోసమే కెసిఆర్ రైతుబంధు డ్రామాలు ఆడుతున్నాడు. సత్తుపల్లి నియోజకవర్గానికి 10 సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పని చేయలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి జరిగింది. బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఒక్కరికైనా పింఛన్ ఇచ్చారా? ఇండ్లు ఇచ్చారా? రేషన్ కార్డు ఇచ్చారా? కొలువులు ఇచ్చారా? చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేశారా? కాంగ్రెస్ హయాంలోనే సత్తుపల్లి నియోజకవర్గంలో కాలువలు తవ్వించారు. రోడ్లు వేశారు. ఇల్లు కట్టించారు. ఇంటి స్థలాలు ఇచ్చారు. రేషన్ కార్డు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ఇచ్చారు. మరి బిఆర్ఎస్ ఏం చేసినట్టు? ఏకకాలంలో రుణమాఫీ చేయని కేసీఆర్ సర్కార్ ఎన్నికల కోసం రైతుబంధు ఇవ్వడానికి ఈసీ నుంచి అనుమతి తెచ్చుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి 15 వేల రూపాయలు రైతుబంధు ఇస్తాం. కెసిఆర్ మాదిరిగా కాంగ్రెస్ గాలి కబుర్లు చెప్పదు.
గ్యారెంటీగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించడానికి కేసీఆర్, కేటీఆర్‌కు బుద్ధుండాలి. ప్రజల సంపదను ప్రజలకు పంచితే ఇవే కాదు, ఇంకా మరిన్ని పథకాలు ఇవ్వొచ్చు. రాహుల్ గాంధీ చెప్పినట్టు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. డిసెంబర్ 3న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రజా సేవకురాలు డాక్టర్ రాగమయిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. నోట్ల కట్టల సంచులతో రాజకీయం చేస్తూ ఎన్నికల్లో గెలుస్తామని విర్రవీగుతున్న బిఆర్ఎస్‌ను ఓడించండి.