Mallu Bhatti Vikramarka: భట్టికి మళ్లీ అవమానం! భట్టి వర్గం రగిలిపోతుందా..?

ఇప్పుడు తుక్కుగూడలో కాంగ్రెస్ మేనిఫెస్టో సభ దగ్గరకు భట్టి కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని పోలీసులు అనుమతించలేదు. అంతేకాదు, ఆ వాహనం ఆపి డ్రైవర్‌పై కూడా పోలీసులు చేయి చేసుకున్నారని తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - April 7, 2024 / 01:08 PM IST

Mallu Bhatti Vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మళ్లీ అవమానం ఎదురైందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది కావాలని చేశారా.. తెలియకుండానే అలా జరిగిపోయిందా అనే సంగతి ఎలా ఉన్నా.. తుక్కుగూడ వేదికగా జరిగిన ఓ ఘటన మాత్రం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల యాదాద్రిలో భట్టిని కింద కూర్చోబెట్టారని జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. యాదాద్రి, లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్, ఇతరులు పీఠలపై కూర్చుంటే.. భట్టి మాత్రం కింద కూర్చున్న ఫొటో వైరల్ అయింది.

CHANDRABABU NAIDU: కుప్పంలో వాలంటీర్ల రాజీనామా.. చంద్రబాబుకు ఓటమి తప్పదా..?

దళితుడు కాబట్టే భట్టిని కింద కూర్చోబెట్టి, అవమానించారని.. చాలా విమర్శలు వినిపిచాయ్. ఐతే దాని మీద భట్టి స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో.. అప్పటికి అది సద్దుమణిగింది. ఐతే ఇప్పుడు తుక్కుగూడలో కాంగ్రెస్ మేనిఫెస్టో సభ దగ్గరకు భట్టి కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని పోలీసులు అనుమతించలేదు. అంతేకాదు, ఆ వాహనం ఆపి డ్రైవర్‌పై కూడా పోలీసులు చేయి చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌తో భట్టి వర్గం మరింతగా రగిలిపోతోంది. సభలోకి వెళ్లేందుకు పాస్‌ ఉందని డ్రైవర్‌ చెప్తున్నా.. పోలీసులు వినిపించుకోలేదు. డ్రైవర్‌ శ్రీనివాస్‌పై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి చేయి చేసుకున్నారని తెలుస్తోంది. డ్రైవర్ జేబులోని ఐడీ కార్డును లాక్కొని, వాహనాన్ని నిలిపివేశారని తెలుస్తోంది. ఐతే దానికి సంబంధించిన వీడియోలు ఇవే అంటూ.. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

ఐతే ఈ ఘటనను భట్టి వర్గం తీవ్ర అవమానంగా పరిణిగిస్తూ.. రగిలిపోతోంది. గతంలో కొన్ని ప్రభుత్వ ప్రకటనల్లో భట్టి ఫొటో మిస్ కావడం, ఆ తర్వాత యాదాద్రి క్షేత్రంలో చిన్నపీట అవమానం ఇప్పటికీ చాలామంది మర్చిపోలేదు. ఈలోపే.. ఇలా జరగడం మరింత చర్చకు కారణం అవుతోంది. మంత్రి పొంగులేటికి ఇచ్చిన ప్రాధాన్యం కూడా భట్టికి ఇవ్వడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయ్.