Rajtarun WhatsApp chat : మాల్వి, రాజ్‌తరుణ్ వాట్సాప్ చాట్ లీక్… బయపడ్డ ఎఫైర్.. చాటింగ్‌లో ఏముందంటే..

హీరో రాజ్‌తరుణ్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్‌తరుణ్‌ను తనను పెళ్లి చేసుకొని దూరం పెడుతున్నారని గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది లావణ్య.

హీరో రాజ్‌తరుణ్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్‌తరుణ్‌ను తనను పెళ్లి చేసుకొని దూరం పెడుతున్నారని గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది లావణ్య. ఐతే ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్య రిలేషన్‌లో ఉందని రాజ్‌తరుణ్‌ చెప్తున్నాడు. లావణ్య కేసు ఫైల్ చేసినప్పటి నుంచి మొదలు.. రోజుకో వీడియో, రోజుకో ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

మాల్వితో ఎఫైర్ పెట్టుకొని రాజ్‌తరుణ్‌ తనను దూరం పెడుతున్నారని లావణ్య అంటోంది. రాజ్‌ తరుణ్‌, తాను 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. ఇద్దరు గుడిలో వివాహం కూడా చేసుకున్నారని.. ఇన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న తమ మధ్య హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా రాకతో గొడవలు మొదలయ్యాయని లావణ్య అంటోంది. మాల్వీకి, రాజ్‌ తరుణ్‌కి ఇల్లీగల్‌ రిలేషన్‌ ఉందని.. ఆమె కోసం రాజ్‌.. తనను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని.. అందుకే తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించాడని ఆరోపించింది. అలానే మాల్వీ, ఆమె సోదరుడు తనను చంపుతామని బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపించింది. రాజ్‌ తరుణ్‌ తనకు అబార్షన్‌ కూడా చేయించాడని.. అందుకు సంబంధించిన మెడికల్‌ రిపోర్ట్స్‌ను, వారిద్దరి ఫొటోలను పోలీసులకు అందించింది లావణ్య. ఐతే మాల్వితో అలాంటి రిలేషన్ ఏమీ లేదని రాజ్‌తరుణ్ అంటున్నాడు.

ఇలాంటి కన్ఫ్యూజన్ మధ్య… రాజ్‌తరుణ్, మాల్వి మల్హోత్రా వాట్సాప్ చాట్ లీక్ అయింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వాట్సాప్ చాట్‌ను లావణ్యే లీక్ చేసినట్లు తెలుస్తోంది. మాల్వి, రాజ్‌తరుణ్‌ మధ్య జరిగిన మెసేజ్‌ చాట్స్‌ లీక్‌ చేసి.. మరిన్ని సంచలన విషయాలు తెర మీదకు తెచ్చింది లావణ్య. మాల్వీకి రాజ్‌తరుణ్‌ ప్రపోజ్‌ చేయడం.. ఆమె దానికి అంగీకారం తెలపడం వంటి ఈ చాటింగ్‌లో ఉన్నాయ్. రాజ్‌ తరుణ్‌, మాల్వీల డేట్‌, మీటింగ్‌కు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయ్‌. వాళ్లిద్దరు ఏ హోటల్‌ రూమ్స్‌లో కలుసుకున్నారులాంటి వివరాలు వెలుగులోకి వచ్చాయి.

2023లో మాల్వికి రాజ్‌తరుమ్‌ లవ్‌ ప్రపోజ్ చేయగా.. ఆమె యాక్సెప్ట్ చేసినట్లు చాటింగ్‌తో అర్థం అవుతోంది. కోయంబత్తూర్‌లోని మాధవ హోటల్‌లో రాజ్‌తరుణ్‌, మాల్వి కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అటు మాల్వికి రాజ్‌తరుణ్‌ వీడియో కాల్స్ కూడా చేసినట్లు అర్థం అవుతోంది. మరి ఇన్నాళ్లు మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పిన రాజ్‌ తరుణ్‌.. ఇప్పుడీ చాటింగ్ మీద ఎలా రియాక్ట్ అవుతాడన్నది ఆసక్తికరంగా మారింది.