Mamata Banerjee: కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, టీఎంసీ, జేడీయూ, ఎస్పీ, డీఎంకే వంటి పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి, బీజేపీని ఓడించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. కానీ, ఈ కూటమికి ఇప్పుడు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
BRS MLAS: మనసు మార్చారా? ఆ నలుగురు కాంగ్రెస్‌లో చేరట్లేదా..? వాళ్ళని పంపింది హరీష్ రావేనా..?
సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్‌తో జరిపిన చర్చలు విఫలం కావడం వల్లే ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు మమత తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ సీట్లున్నాయి. అందులో రెండు మాత్రమే కాంగ్రెస్‌కు ఇస్తామని మమత చెప్పింది. దీనికి కాంగ్రెస్ అంగీకరించలేదు. అంత తక్కువ సీట్లతో సర్దుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. ఈ నేపథ్యంలో తాము రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా తాము ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తెలిపింది. మమత నిర్ణయం కాంగ్రెస్ పార్టీకే కాదు.. ఇండియా కూటమికే షాక్ అని చెప్పాలి. ఈ సందర్భంగా మమత మాట్లాడారు. విపక్ష కూటమికి ‘ఇండియా’ అనే పేరును ప్రతిపాదించింది తానేనని మమత బెనర్జీ వెల్లడించారు. అయితే, కూటమిలో కమ్యూనిస్టు పార్టీకి ప్రాధాన్యం ఇవ్వడం తమకు నచ్చలేదని, ఆ పార్టీపై టీఎంసీ పోరాడిందని, సీపీఎం చెబితే తాము వినాల్సిన అవసరం లేదని మమత అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లో, 300 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయాలని తాను ప్రతిపాదించినప్పటికీ, కాంగ్రెస్ అంగీకరించలేదన్నారు. నిజానికి కూటమిగా ఏర్పడ్డప్పటికీ అనేక పార్టీల మధ్య ఇంకా సఖ్యత లేదు. సీట్ల విషయంలో, ప్రధాని అభ్యర్థి వంటి విషయాల్లో స్పష్టత లేదు. కాంగ్రెస్‌కు కమ్యూనిస్టు పార్టీలు, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలతో విబేధాలున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీలు నష్టపోతాయి. అయితే, ఎక్కువగా నష్టపోయేది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. అయితే, ప్రస్తుతం రాహుల్ గాంధీ.. భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో పర్యటిస్తున్న సంగత తెలిసిందే. ఆయన త్వరలోనే పశ్చిమ బెంగాల్‌లో కూడా అడుగుపెట్టబోతున్నారు. మరి.. టీఎంసీ, కాంగ్రెస్ మధ్య పొత్తు విఫలమైన నేపథ్యంలో రాహుల్ ఎలా స్పందిస్తారో చూడాలి.