Alla Ramakrishna Reddy : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే).. పార్టీకి, పదవికి రాజీనామా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆర్కే అసెంబ్లీలో తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో అందజేశారు. ఆర్కే గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆర్కే అసెంబ్లీలో తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో అందజేశారు. ఆర్కే గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి. గత కొంత కాలంగా పార్టీకీ.. పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కేవలం ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాలకు మాత్రమే ఆర్కే హాజరవుతూ వస్తున్నారు.

వైసీపీ ఇన్ ఛార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తుండడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. నిన్న (ఆదివారం) గంజి చిరంజీవి ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.ఇదే కాక వైసీపీ రెండో మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంపై కూడా ఆర్కే ఆవేదనతో ఉన్నట్టుగా ప్రచారం జరగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన అసెంబ్లీ స్థానాన్ని బీసీ సామాజిక వర్గ నేతకు కేటాయిస్తుందనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీకీ వైసీపీకి గుడ్ బాయ్ చెప్పారు.