మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేశారు. స్పీకర్ తమ్మినేని అందుబాటులో లేకపోవడంతో.. రిజైన్ లెటర్ ను అసెంబ్లీ సెక్రటరీకి అందించారు. కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు ఆర్కే దూరంగా ఉంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యే టిక్కెట్ ను బీసీ నాయకుడికి ఇస్తోందన్న ప్రచారంతో ఆయన అధిష్టానంపై అలకబూనారు. చివరకు మంగళగిరి ఎమ్మెల్యేకి, వైసీపీకి కూడా రాజీనామా చేశారు రామకృష్ణారెడ్డి.
ARTICLE 370 : 370 ఆర్టికల్ రద్దు కరెక్ట్.. సుంప్రీకోర్టు సంచలన తీర్పు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే.. మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీపై కేసులు వేయడంతో ఏపీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అమరాతి వైసీపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఆర్కే.. మొదటి నుంచి జగన్ కు నమ్మిన బంటు కూడా. మంగళగిరిలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ను ఓడించారు. అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించినా.. లోకేష్ ని ఓడించడం అప్పట్లో సంచలనం కలిగించింది. గత కొంత కాలంగా ఆర్కే పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. ఎమ్మెల్యేగా మాత్రమే అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆర్కే ఎప్పటి నుంచో ఆవేదనగా ఉన్నట్టుగా అనుచరులు చెబుతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీలో కీలకంగా ఉన్న ఆర్కే రిజైన్ వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు. మంగళగిరి అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ.. బీసీలకు కేటాయిస్తుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచే ఆర్కే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఈ పరిస్థితుల్లో తనను సీఎం జగన్ గానీ… ఇతర సీనియర్లు గానీ ఎవరూ పట్టించుకోకపోవడం మరింత ఇబ్బందిగా మారింది. మంగళగిరి వైసీపీ ఇంచార్జ్‌గా గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం ఈమధ్యే నియమించింది. ఆయన ప్రత్యేకంగా పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్కేని పిలవనట్టుగా తెలుస్తోంది. ఇంత అవమానకర పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కష్టమే అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి భావించారు. అందుకే రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
వైనాట్ 175 అంటున్న వైఎస్సార్ పార్టీ ఈసారి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంపైనా ప్రత్యేక దృష్టి పెడుతోంది. మంగళగిరిలో నారా లోకేష్ టీడీపీ నుంచి పోటీ చేస్తుండటంతో… ఈ సీటును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సీటు ఎట్టి పరిస్థితుల్లో ఓడి పోకూడదని గట్టిగా డిసైడ్ అయింది. నారా లోకేష్ ను ఓడించాలంటే.. మంగళగిరిలో బీసీ అభ్యర్థిని పెట్టాలని వైసీపీ భావిస్తోంది. అందుకే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేను మార్చబోతున్నారు. ఇది గ్రహించినందునే ఆయన రిజైన్ చేసినట్టు అనుచరులు చెబుతున్నారు.