దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎవరికివారు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇక జాతీయ పార్టీలు సైతం ప్రత్యర్థులపై తమ వ్యూహాలతో ఎన్నికల సమరం శంఖం పురిస్తుంది. తాజాగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోను జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఏఐసీసీ సీనియర్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదలైంది.
ఇక ఈ ఎన్నికల మేనిఫెస్టోను న్యాయ్‌పత్ర-2024 పేరుతో కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 48 పేజీలతో.. 5 న్యాయ పథకాలతో.. 25 హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో
విడుదల చేసింది.
కాంగ్రెస్ మేనిఫెస్టో :
దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తో హాస్పిటల్ ఏర్పాటు.
యూనివర్సిటీలో వివక్షకు గురవుతున్న విద్యార్థులకు న్యాయం చేసేందుకు రోహిత్ వేముల ఆక్ట్ అమలు చేస్తాం. వెనకబడిన పేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం.. బ్యాంకు అకౌంట్‌లో వెస్తాము. ప్రభుత్వ ఉద్యోగాలలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం. దేశవ్యాప్తంగా నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు, కస్తూర్బా గాంధీ పాఠశాల పాఠశాలల సంఖ్య పెంచుతాం.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జుణ ఖర్గే..
- నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు.
- MS స్వామినాథన్ సిఫార్సుల మేరకు రైతులకు కనీస మద్దతు ధర
- నూతన వ్యవసాయ చట్టాలను అధికారం రాగానే తీసేస్తాం.
- మన రేగా రోజు వారి వేతనం 400 వందలకు పెంపు.
- నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తాం.
- వ్యవసాయ పరికరాలపై GST మినహాయింపు.
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు.
- SC, ST, BC విద్యార్థులకు స్కాలర్‌షిప్ రెట్టింపు.
- SC, ST, BCలకు రిజర్వ్ చేసిన పోస్టులను ఏడాదిలో భర్తీ చేస్తాం.
- సామాజిక న్యాయం కింద పింఛన్ రూ.1000కి పెంపు.
- వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పింఛన్ పెంపు.
- ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.400కు పెంపు.
- ఎంఎస్ పి డైరెక్ట్‌గా రైతులకు కేంద్రాలలో ఇస్తాము..
- రైతు రుణాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తాం..
- మన రేగా రోజు వారి వేతనం 400 వందలకు పెంపు.
- పట్టణాలలో అర్బన్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం.
- సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఖాళీల భర్తీ 3 ఏళ్లలో పూర్తి చేస్తాం.
రాహుల్ గాంధీ…
- బీజేపీ చేతిలో సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు ఉన్నాయి: రాహుల్
- నాలుగు పెద్ద కార్పొరేట్ సంస్థల కోసం దేశం కాదు.
- వ్యాపారస్తుల మధ్య పారదర్శక పోటీ ఉండేలా చూస్తాం.
- కాంగ్రెస్ గ్యారంటీలంటే.. కాంక్రీట్ గ్యారంటీలే.
- కేంద్రసంస్థలతో బెదిరించి నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారు.
- కేంద్రసంస్థలను ప్రయోగించి పార్టీకి నిధులు సమకూర్చుకుంటున్నారు.
- ఆర్థికంగా బీజేపీ తమను తాము పరిపుష్టం చేసుకున్నారు.
- బీజేపీ మేనిఫెస్టోలో 1-2% ఉన్న అదానీ వంటివారు కోరుకున్నవి ఉంటాయి.
- మా మేనిఫెస్టోలో మాత్రం మిగతా 98-99% ప్రజలు కోరుకునేవి ఉన్నాయి.
- ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేవారికి.. కాపాడేవారికి మధ్య పోరాటం.