నితీశ్ తీసేయాలన్న మంజ్రేకర్, మండిపడుతున్న భారత్ ఫ్యాన్స్

ఆస్ట్రేలియా టూర్ లో తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి ఆకట్టుకుంటున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫ్యూచర్ ఆల్ రౌండర్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు. తొలి రెండు టెస్టుల్లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్‌తో దుమ్మురేపాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 41, 38 నాటౌట్, 42, 42 పరుగులతో రాణించాడు.

  • Written By:
  • Publish Date - December 12, 2024 / 12:57 PM IST

ఆస్ట్రేలియా టూర్ లో తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి ఆకట్టుకుంటున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫ్యూచర్ ఆల్ రౌండర్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు. తొలి రెండు టెస్టుల్లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్‌తో దుమ్మురేపాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 41, 38 నాటౌట్, 42, 42 పరుగులతో రాణించాడు. కానీ బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 2 వికెట్లు మాత్రమే తీసాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ వైఫల్యం జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లపై అదనపు ఒత్తిడిని తీసుకొస్తోంది. ఆల్ రౌండర్ రోల్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలన్నదే పలువురి సూచన… ఈ క్రమంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేాశాడు. తుది జట్టు నుంచి నితీష్ రెడ్డిని తప్పించాలని మంజ్రేకర్ సూచించాడు. బంతితో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్న నితీష్ ని కేవలం బ్యాటర్‌గా కొనసాగించడం సరికాదంటున్నాడు.

నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులో ఆడించడం ద్వారా బౌలింగ్ అటాక్ బలహీనమవుతుందని చెప్పాడు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డిని తప్పించి ఎక్స్‌ట్రా బౌలర్ లేదా బౌలింగ్ సామర్థ్యం కలిగిన బ్యాటర్‌ను తీసుకోవాలని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు.నితీష్లో అసాధారణమైన బ్యాటింగ్ ప్రతిభ ఉందన్న మంజ్రేకర్. .. ఆల్ రౌండర్ గా ఎదగాలంటే బంతితోనూ సత్తా చాటాల్సి ఉంటుందన్నాడు. బ్యాటింగ్ సమస్యలను పరిష్కరిస్తూనే బౌలింగ్ బలాన్ని పెంచుకోవాలని టీమిండియా మేనేజ్ మెంట్ కు సూచించాడు. నితీశ్ ను కేవలం బ్యాటింగ్ కోసమే జట్టులో కొనసాగించడం రిస్కీనే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మంజ్రేకర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో కాస్తో కూస్తో మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్న నితీష్ రెడ్డి తప్పించడం ఏంటని మండిపడుతున్నారు. కావాలంటే పేలవ ఫామ్‌తో తడబడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ‌ను తుది జట్టులో నుంచి తప్పించాలని సూచిస్తున్నారు.