బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల రచ్చ కొనసాగుతోంది. సైనిక పాలన మొదలైనప్పటికీ విధ్వంసం మాత్రం ఆగలేదు. ప్రధాని షేక్ హసీనా ఆవామీ లీగ్ పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్ళలోనూ విధ్వంసం సృష్టించారు. ఆ పార్టీకి చెందిన చెందిన ఎంపీ, బంగ్లాదేశ్ మాజీ కేప్టెన్ ముష్రఫీ మొర్తాజా నివాసాన్ని తగలబెట్టేశారు మొర్తాజా ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేసిన ఆందోళనకారులు చేతికి అందిన వస్తువులను ఆయన ఇంటిపైకి విసిరారు. విలువైన వస్తువులను చోరీ చేశారు. మొర్తాజా 2018లో ఆవామీ లీగ్ పార్టీలో చేరి ఎంపీగా గెలిచాడు. 2019 ఐసీసీ వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ జట్టుకు అతనే కేప్టెన్. 36 టెస్టులు, 220 వన్డేలు, 54 టీ ట్వంటీలు ఆడిన మోర్తాజా ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహించాడు.