Tamil Nadu bomb blast : మేడే రోజున తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు కార్మికులు మృతి

దేశ వ్యాప్తంగా కార్మీకులు అందురు మేడే సందర్భంగా సంభరాలు చేసుకుంటుంటే.. మన దిగువ రాష్ట్రం అయిన తమిళనాడులో ఘోర ప్రమారం.. విషాద చాయలు అలుముకున్నాయి. మేడే రోజున తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది.

దేశ వ్యాప్తంగా కార్మీకులు అందురు మేడే సందర్భంగా సంభరాలు చేసుకుంటుంటే.. మన దిగువ రాష్ట్రం అయిన తమిళనాడులో ఘోర ప్రమారం.. విషాద చాయలు అలుముకున్నాయి. మేడే రోజున తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విరుధ్ నగర్ జిల్లా కరియపట్టి సమీపంలోని క్వారీలో ఉపయోగించే పేలుడు పదార్థం ధాటికి నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. 12 మందికి తీవ్రంగా గాయపడ్డారు.

ఈ భారీ పేలుడు ధాటికి మరి కొందరు కార్మికులు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా అటవీ ప్రాంతంలో అక్కడక్కడా కార్మికుల దేశాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బ్లాస్టింగ్ దృశ్యాలు బాంబు వేసినట్లు భయానకంగా ఉన్నాయి. పేలుడు పదార్థాలను భద్రపరచిన గది ఆనవాళ్లు లేకుండా ధ్వంసమైంది. అలాగే పేలుడు పదార్థాలు ఉన్న భవనం సమీపంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సుమారు 20 కి.మీ. వరకు పేలుడు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

SSM