America Politics: స్పీకర్ నే తొలిగించేలా వేడెక్కిన అమెరికా రాజకీయం.. 234 ఏళ్ళలో ఇదే తొలిసారి

అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని అడ్డుకున్న రిపబ్లికన్ స్పీకర్ పై వేటు వేసిన సొంత పార్టీ నేతలు. దీనికి కారణం ఇదే.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 09:20 AM IST

ఆంధ్రాలోనే కాదు అమెరికాలో కూడా రాజకీయం వేడెక్కింది. మనలాగే వ్యూహాలు, యుక్తులు, కుయుక్తులు అక్కడి రాజకీయ నాయకుల్లో కూడా ఉన్నాయి. అవి ఎప్పుడోగాని వెలుగులోకి రావు. తాజాగా ఇలాంటి పరిస్థితి తలెత్తి స్పీకర్ పదవిని కోల్పోవల్సి వచ్చింది. అదికూడా అధిక సభ్యుల మద్దతు ఉన్న పార్టీ వ్యక్తే కావడం విశేషం. ఈ రాజకీయ పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం.

షట్ డౌన్ నివారణలో కీలక పాత్ర..

అమెరికా రాజకీయాల్లో సరికొత్త అధ్యయనానికి తెరలేపింది. దాదాపు 234 ఏళ్ల తరువాత ఇలా జరగడం ఇదే తొలిసారి. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఆధిపత్యం రిపబ్లికన్లకే ఉంటుంది. అలాంటి పార్టీకి చెందిన సభ్యూడినే స్పీకర్ గా తొలగిస్తూ ఓటింగ్ చేపట్టారు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. మన్నటి జో బైడెన్ పాలనలో షట్ డౌన్ ను నివారించడంలో స్పీకర్ కీలక పాత్ర పోషించారు. ఫెడరల్ పార్టీ నాయకుడు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయనపై రిపబ్లికన్లు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. బైడెన్ ను గద్దె దింపేందుకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని కాపుకాస్తున్నారు.

జో బైడెన్ బిల్లులు ఆమోదమే కారణం

బైడెన్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టేందుకు అవకాశం రానే వచ్చింది. ఆయన ప్రవేశ పెట్టిన బిల్లులు తిరస్కరణకు గురయ్యేలా చేస్తూ తీర్మానం చేస్తే ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తుందని భావించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఆర్థిక సంత్సరానికి గానూ జో బైడెన్ ప్రవేశ పెట్టిన బిల్లులకు పెద్దగా మద్దతు లభించలేదు. దీంతో ఆర్థికంగా దెబ్బతింటుంది ప్రభుత్వం అని భావించారు. దీనికి మద్దతు ఇస్తూ అవసరమైన బిల్లులను పాస్ చేస్తూ మెక్ కార్తి నిర్ణయం తీసుకున్నారు. దీంతో జోబైడెన్ కు షట్ డౌన్ ముప్పు తప్పింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊపిరి పీల్చుకుంది. మరో ఏడాది కాలంలో అధ్యక్షుడి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా చేసినందుకు రిపబ్లికన్లు స్పీకర్ పై రగిలిపోతున్నారు. ఇలా చేయడం వల్ల ఫెడరల్ పార్టీకి సానుకూలత వచ్చే అవకాశం ఉందని భావించారు. తమ పార్టీ మద్దతుతో పదవిలో కూర్చొని జో బైడెన్ కు ఎలా మద్దతు ఇస్తారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

సొంత పార్టీ అభ్యర్థులే వ్యతిరేకం..

ఇలాంటి సమయంలో మరో తీర్మానం సభలో జరిగింది. అదే స్పీకర్ పై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడం. మంగళ వారం దీనిపై సభలోని సభ్యులు ఓటింగ్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలో స్పీకర్ కు అనుకూలంగా 216 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 210 ఓట్లు పోలయ్యాయి. దీంతో పాటూ మరో ఎనిమిది మంది రిపబ్లికన్ రెబల్ అభ్యర్థులు మెక్ కార్తికి ప్రతికూలంగా నిలిచారు. ఇందులో రిపబ్లికన్ గ్రూప్ అధినేత మ్యాట్ గాయోట్జ్ ఉండటం గమనార్హం. స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కార్తికి గాయెట్జ్ కి పడేది కాదు. ఈ వైరాన్ని అలాగే కొనసాగించి సమయం చూసి పదవిపై దెబ్బ కొట్టారు. మెక్ కార్తి వయసు 58 సంవత్సరాలు. ఈయన ఎంటర్ ప్రెన్యూర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి ఈ ఏడాది జనవరిలో 55వ స్పీకర్ గా ఎన్నికయ్యారు. తాజా పరిస్థితుల నడుమ పదవి కోల్పోవడంతో అతి తక్కువ కాలం పనిచేసిన స్పీకర్ గా రికార్డ్ నమోదైంది.

తక్కువ కాలం పనిచేసి సభాపతులు వీరే..

  • 1910 తిరుగుబాటు తర్వాత జోసెఫ్ జి కెనాన్ ను స్పీకర్ పదవి నుంచి తొలగించేందుకు తీర్మానం ప్రవేశ పెట్టారు. అయితే సరైన సభ్యుల మద్దతు లేక అది విఫలమైంది.
  • మన్న 2015లో కూడా జాన్ బోహెనర్ పై మార్క్ మెడోస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని గుర్తించిన బోహెనర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మార్క్ ప్రవేశపెట్టిన మోషన్ పై ఓటింగ్ జరగలేదు.
  • 2023 అక్టోబర్ 3ప మెక్ కార్తి తన సభాధిపతి పదవిని కోల్పోయారు. దీంతో తక్కువ కాలం స్పీకర్ గా బాధ్యతలు
    నిర్వహించిన వారిలో మూడవ స్థానంలో ఉన్నారు. అమెరికా చరిత్రలో 147 ఏళ్ల కాలంలో ఇంత తక్కువ కాలం పనిచేసిన వారిగా రికార్డ్ సృష్టించారు.

T.V.SRIKAR