బాటిల్‌లో పెట్రోల్ నింపుకుని హాస్టల్‌కు చేరుకుంది. రూంలోఎవరూ లేని టైం చూసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. మానస పెట్రోల్ కొంటున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మంటల్లో కాలిపోతు ఆర్తనాధాలు పెట్టడంతో హాస్టల్‌లోని విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు మందు కూడా మానస రూం నుంచి పెద్ద శబ్ధాలు వచ్చాయని విద్యార్థులు చెప్తున్నారు.
80 శాతం కాలిపోయిన మానసను పోలీసులు వరంగల్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. వరంగల్‌లోని పోచంమైదాన్ ప్రాంతానికి చెందిన మానసకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. దీంతో తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. రీసెంట్‌గానే తండ్రి కూడా చనిపోయాడు. అప్పటి నుంచి మానస డిప్రెషన్‌లో ఉన్నట్టు ఆమె ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఎప్పుడు చూసినా తన తండ్రినే తల్చుకుంటూ ఏడ్చేదని చెప్తున్నారు.
ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో బీడీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కాలేజ్‌కు ఎదురుగానే ఉన్న ప్రైవేట్ హాస్టల్‌లో నాలుగో ఫ్లోర్‌లో ఒంటరిగా ఉంటోంది. మానసది క్లియర్‌గా ఆత్మహత్యే అని నిర్ధారించినప్పటికీ ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటి వరకూ తెలియరాలేదు. అటు మానస కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, కనీసం వాళ్లు కేసు కూడా నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ప్రస్తుతానికి మానస మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపిన పోలీసులు విచారణ ప్రారంభించారు. మానస ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే ఈ కేసులో లీడ్ దొరికే చాన్స్ ఉందని పోలీసులు చెప్తున్నారు.