ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఢిల్లీలోని పాత పార్లమెంట్ (Old Parliament) భవనంలో సెంట్రల్ హాల్ లో ఎన్డీయే కూటమి నేతలు భేటి అయ్యారు. మోదీ (Narendra Modi) నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. ఈ భేటిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్ పాలొన్నారు. ఈ సమావేశానికి 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జన్ శక్తి, రాంవిలాస్, NCP, JDS, జనసేన, అప్నాదళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీయేలోని పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు.
ఈ సమావేశంలో ఎన్డీయే ప్రధాని అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకుంటున్నారు. ఈ నేపంథ్యంలో ఆ కూటమి తరఫున గెలిచిన ఎంపీలంతా పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎన్డీఏ కీలకనేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నితీశ్ కుమార్ తో పాటు ఎన్డీయే ఇతర ఇతర ముఖ్యనేతలంతా స్టేజిపై ఆసినులయ్యారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు బీజేపీ ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశం అనంతరం తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌కుమార్‌సహా ఇతర ఎన్డీయే ముఖ్యనేతలతో కలిసి నరేంద్రమోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎంపీల సంతకాలతో కూడిన లేఖను అందజేస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరనున్నారు. ఇక , జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు భారత ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా ఈ కార్యక్రమం కర్తవ్యపథ్‌లో జరగనున్నట్లు సమాచారం..