ఆదర్శంగా నిలవడం అంటే ఇది… ఇచ్చిన మాటను గౌరవించడం అంటే ఇది… కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడం అంటే ఇది… ఎవరికి స్థాయికి తగ్గట్టు కుటుంబంలో ఉన్న అందరూ సాయం చేయడం అంటే అదేమి సాధారణ విషయం కాదు… ఎవరి గురించో మీకు అర్ధమయ్యే ఉంటుంది కదూ… ఎస్ మెగా ఫ్యామిలీ గురించి. బెజవాడ వరద బాధితులకు, ఖమ్మం వరద బాధితులకు మన సాయం మనం చేయాలి… అందరికి ఆదర్శంగా నిలిచి సాయం అందించాలి. అండగా నిలబడటం అనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలి… అన్నట్టుగా ఒక్కొక్కరు ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చారు.
తన స్థాయికి తగ్గట్టు నిహారిక కూడా కూడా సాయం చేసారు. పవన్ ఫోన్ చేసి… విజయవాడకు అండగా నిలవాలని మెగా హీరోలకు డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అంతే… చిరంజీవి మొదలు ప్రతీ ఒక్కరు సాయం చేసారు. పవన్ కళ్యాణ్ ఏకంగా ఆరు కోట్ల రూపాయలు సాయం చేసి తన పెద్ద మనసు చాటాడు. ఆ తర్వాత మెగా హీరోలు ఒక్కొక్కరిగా అమరావతి వస్తున్నారు. సాయి ధరం తేజ్ విజయవాడ వచ్చి బాధితులకు సాయం చేసారు. ఇప్పుడు రామ్ చరణ్ అమరావతి వస్తున్నాడు.
ఎన్టీఆర్ తో కలిసి చంద్రబాబుని, పవన్ ను కలిసి తన 50 లక్షల చెక్ అందిస్తాడు రామ్ చరణ్. మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉన్న అల్లు అర్జున్ కూడా చంద్రబాబుని కలిసి అందించే అవకాశం ఉంది. తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి విజయవాడ రానున్నాడు అల్లు అర్జున్. నిహారిక… బాబాయి తరహాలోనే గ్రామ పంచాయితీల కోసం సాయం చేసింది. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ప్రతీ ఒక్కరు అండగా నిలబడుతున్నారు రాష్ట్రానికి. సినిమా పరిశ్రమలో మెగా కుటుంబం నుంచి వచ్చిన సాయం ఎక్కువ. దాదాపు 9 కోట్ల రూపాయలు మెగా ఫ్యామిలీ సాయం అందించింది.