Parliament Canteen: నూతన పార్లమెంట్ క్యాంటీన్ లో ఏమేమి దొరుకుతాయి.. వాటి ధరలు ఎంతో తెలుసా..?

పార్లమెంట్ సభ్యులు సమావేశాలు జరిగే సమయంలో క్యాంటీన్ కి వెళ్లి తినాల్సి వస్తుంది. వీరి కోసం ఏమేమి అందుబాటులో ఉంటాయో చూసేద్దాం.

  • Written By:
  • Updated On - September 20, 2023 / 12:47 PM IST

ప్రజల శ్రేయస్సు కోరుకునే ప్రజా ప్రతినిధులు సమావేశాల సమయంలో భోజనం ఎలా చేస్తారు. ఇంటి వద్ద నుంచి తీసుకెళ్ళడానికి కుదరదు కదా. పైగా ఢిల్లీలో ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడు కేవలం అన్నం వండుకొని తినడం కోసం ఇళ్లు తీసుకోలేడు.  మరి అలాంటి సమయంలో దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి పార్లమెంట్ క్యాంటీన్ లో ఏఏ పదార్థాలు దొరుకుతాయి. ఎంత ధరలకు అందుబాటులో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఎక్కడ చూసినా పార్లమెంట్ భవనం గురించే చర్చ జరుగుతోంది. నూతన భవనం కావడం, అక్కడి నిర్మాణాలు దేశంలోని సంస్కృతిరి ప్రతిబింబించడంతో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. పైగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావడంతో తమకు మేలు జరిగిందని మహిళలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ క్యాంటీన్ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా క్యాంటీన్ అనే పదాన్ని కాలేజీ చదివే రోజుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ తరువాత వివిధ కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా ఈ మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే పార్లమెంట్ క్యాంటీన్ కి ఒక ప్రత్యేకత ఉంటుందని భావిస్తారు. అదే తక్కువ ధరలకు మంచి ఆహారం లభిస్తుంది అనే నానుడి ఎన్నో ఏళ్ల నుంచి వస్తోంది.

ఎందుకంటే ఇక్కడ భోజనం నుంచి టీ వరకూ తాగేందుకు తినేందుకు వచ్చేవారు సామాన్యులు కాదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు. వీరిలో చాలా మందికి కోట్లకు పైగా ఆస్తులు ఉంటాయి. అయినప్పటికీ తిండి దగ్గర అందరూ సమానమే కదా. వేల కోట్లు సంపాదించే అంబానీ, అదానీలైనా ఆకలైతే అన్నం తింటారే తప్ప బంగారం, కరెన్సీని తినలేరు కదా. అందుకే వీరికి కూడా ప్రత్యేకమైన క్యాంటీన్లు అందుబాటులో ఉంటాయి. అయితే అక్కడ ధర ఎంత ఉంటుంది. వందల్లో, వేలల్లో బిల్లు అవుతుందా అనే అనుమానం మీలో కలుగవచ్చు. ఇక్కడ చాలా తక్కువ ధరలకే మంచి భోజనం లభిస్తుంది. పైగా శుచి శుభ్రతను కూడా పాటిస్తారు. ఇది పూర్తిగా ఇండియన్ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. తాజాగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనంలోని క్యాంటీన్ ధరలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Parliament Canteen Menu and Prices

2021 సంవత్సరానికి గానూ పార్లమెంట్ క్యాంటీన్ లో లభించే ఆహార పదార్థాల ధరల్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ప్రస్తుతం సమాజంలో పెరిగిన ధరలు, పరిస్థితుల దృష్ట్యా వీటి ధరల్లో కూడా వ్యత్యాసం కనిపిస్తోంది. పాలు, టీ మొదలు శాఖాహార, మాంసాహార పదార్ధల వరకూ అన్నీ లభిస్తాయి. దాదాపు 60 ఐటెమ్స్ తో కూడిన మెనూను ఇప్పుడు చూసేద్దాం.

Parliament Canteen Menu and Prices

T.V.SRIKAR