FB And Instagram: త్వరలో ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్.. నెలకు ఎన్ని డాలర్లో తెలుసా..

మెటా సంస్థకు ఏమైంది. ఒకవైపు లే ఆఫ్ ల పేరుతో ఉద్యోగుల తొలగింపు, మరో వైపు అకౌంట్లపై ఆంక్షలు, డబ్బులు వసూలు చేసే ఆలోచనలు.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 01:16 PM IST

ఒకప్పుడు ఫేమస్ కావాలనుకుంటే ఏ సినిమా రంగంలోనో, టీవీ సీరియల్స్ లోనో కనిపించాలి. అప్పుడే చాలా మందిలో గుర్తింపు లభిస్తుంది. ఇలా కాకుండా గత 15 సంవత్సరాలుగా సామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరి అరచేతుల్లోకి వచ్చేశాయి. తాజాగా అయితే స్మార్ట్ ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఫేస్ బుక్, ఇన్ స్టా అకౌంట్లను డౌన్లోడ్ చేసి తెగ సందడి చేస్తున్నారు. తమకు నచ్చిన పోస్ట్ అప్లోడ్ చేస్తూ ఆ లింకులన షేర్ చేస్తూ లైక్ లు పొందుతూ ఉంటారు. ఇలా ‎ఫేమస్ అయిన వాళ్లు చాలా మంది సినీ రంగంలోకి అడుగు కూడా పెట్టారు.

మోటా సంస్థ కీలక ప్రకటన..

సామాజిక మాధ్యమాల ప్రభావం ప్రతి ఒక్కరిలో తీవ్రంగా పడటంతో ఆయా సంస్థల యాజమాన్యాలు సరికొత్త రూల్స్ తీసుకురానున్నాయి. గతంలో ట్విట్టర్ పేరును మార్చి ఎక్స్ పేరుతో సబ్ స్క్రిప్షన్ ను పొందాలని చెప్పారు. దీనికి కొంత రుసుము చెల్లించాలని ప్రకటించారు. ఇలా చేయకుంటే వ్యక్తి గత సమాచారాన్ని ఎవరైనా చూసేలా పరిస్థితులు ఉంటాయని తెలిపారు. దీంతో అవసరమైన వాళ్లు దీనికి సబ్ స్క్రైబ్ అయ్యారు. ఇదే కోవలోకి తాజాగా ఫేజ్ బుక్, ఇన్ స్టా కూడా చేరిపోనుంది. ఈ విషయాన్ని మెటా సంస్థల అధినేత తెలిపారు.

యాడ్ ఫ్రీ కోసం 40 డాలర్లు..

రానున్న రోజుల్లో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ను ఫ్రీగా కాకుండా నెలకు 14 డాలర్లు చెల్లించేలా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు వేదికల్లో యాడ్ ఫ్రీ సదుపాయాన్ని కల్పించేందుకు నెలకు 40 డాలర్లను వసూలు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిపింది. యూరప్ వినియోగదారులకు ఈ రెండు ఫ్లాట్ ఫాంలకు కలిపి 17 డాలర్లు చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. దీనికి కారణం వినియోగదారుల అనుమతి లేకుండా ఎలాంటి ప్రకటనలు తమ యాప్ లో రాకుండా చేసేందుకు ఈ కొత్త విధానాన్ని రూపొందించనుంది. ఇలా వచ్చే ప్రకటనలపై యూరోపియన్ యూనియన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తరుణంలో దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈవిధానం మన దేశంలోకి కూడా రానుంది అంటున్నారు టెక్ నిపుణులు.

మెటా ఇవ్వనున్న మూడు ఆప్షన్లు ఇవే..

  • ప్రకటనలు లేకుండా సామాజిక మాధ్యమాలను వాడడం కోసం చెల్లింపులు.
  • వ్యక్తిగత ప్రకటనలతో ఈ రెండు సామాజిక మాధ్యమాలను కొనసాగించడం.
  • ప్రస్తుత అకౌంట్లు రద్దు చేసి సబ్ స్క్రిప్షన్ ఉన్న వాటిని తీసుకురావడం

T.V.SRIKAR