Chandrababu Naidu: అంబటి పంచ్‌.. చంద్రబాబు పిటిషన్‌పై అంబటి ఆసక్తికర ట్వీట్‌

మాజీ సీఎం హోదాలో ఉన్న తనను అరెస్టు చేసేటప్పుడు.. సీఐడీ అధికారులు సెక్షన్ 17Aను పాటించలేదని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరుతూ.. గతేడాది సెప్టెంబర్ 22న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

  • Written By:
  • Updated On - January 16, 2024 / 08:05 PM IST

Chandrababu Naidu: స్కిల్‌ స్కామ్‌ కేసులో.. సుప్రీంలో క్వాష్‌ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించలేదు. స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. మాజీ సీఎం హోదాలో ఉన్న తనను అరెస్టు చేసేటప్పుడు.. సీఐడీ అధికారులు సెక్షన్ 17Aను పాటించలేదని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు.

Chandrababu Naidu: ప్రస్తుతానికి నో రిలీఫ్! తీర్పుపై భిన్నాభిప్రాయాలు.. CJI ముందుకు క్వాష్ పిటిషన్..

తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరుతూ.. గతేడాది సెప్టెంబర్ 22న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఐతే దీన్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్న విషయంపై ఏపీ సీఐడీ, చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు రిజర్వ్ చేసింది. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. నేరస్థుడిని ఏ న్యాయస్థానమూ కాపాడదంటూ రాసుకొచ్చారు. చంద్రబాబును ఎవరూ రక్షించలేరని అర్థం వచ్చేలా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద.. గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా సీఐడీ తనపై కేసు నమోదు చేసిందని చంద్రబాబు తరఫు లాయర్ల వాదన. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత.. త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం. సెక్షన్‌ 17A వర్తిస్తుందని జస్టిస్‌ అనిరుద్ధ్ బోస్‌ అంటే.. సెక్షన్‌ 17A వర్తించదని జస్టిస్‌ బేలా వెల్లడించారు. ఇలాంటి పరిణామాల మధ్య నేరస్థులను ఏ కోర్టు కాపాడలేదంటూ అంబటి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.