నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా అచ్చంపేట (Atchampet) బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvwala Balaraju) పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే.. కాగా మెరుగైన చికిత్సకు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో గువ్వల బాలరాజుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అపోలో వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆస్పత్రికి వెళ్లి గువ్వల బాలరాజును పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
MLA Guvwala Balaraju : నా భర్తను కాంగ్రెస్ వాళ్లు చంపేస్తారు.. ఎమ్మెల్యే భార్య కన్నీళ్లు..
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ (Congress) అభ్యర్థి వంశీకృష్ణ (Vamsi Krishna) తన అనుచరులతో కలిసి బాలరాజు మీద దాడి చేసిన విధానాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో దాడుల సంస్కృతి ఎప్పుడు లేదు.. కాంగ్రెస్ పూర్తిగా రౌడీ రాజకీయం తీసుకోస్తుంది ఇది మేకే మంచిది కాదు.. గువ్వల బాలరాజు సతీమణి ని కూడా కాంగ్రెస్ నాయకులు అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ చరిత్రలోనే లేని ఈ సంస్కృతిని ప్రవేశ పెడితే తప్పకుండా కాంగ్రెస్ నాయకులు అనుభవిస్తారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే.. తర్వాత ఇంతకు ఇంత అనుభవించి తీరాల్సిందే అంటూ కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఇక తెలంగాణలో శాంతి భద్రతలపై డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు సెక్యూరిటీ పెంచాలని కోరుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.