Minister KTR : నేడు సిరిసిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. పార్టీలో చేరనున్న పలువురు పార్టీ నేతలు..

తెలంగాణలో రాజకీయ (Telangana Politics) ప్రచారాలు ఎవరికి వారు తమ తమ స్టైల్ లో ఎన్నికల ప్రచార హస్త్రాలను ప్రత్యర్థులపై ఎక్కు పెటడుతు ముందుకు సాగుతున్నారు. నేటి మంత్రి కేసీఆర్ (Minister KTR) కూడా తన సొంత ఇలాక సిరిసిల్ల జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ టెక్ సెల్ఫింగ్ కార్యక్రమాన్ని ఉదయం 10:45 గంటలకు ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్.

తెలంగాణలో రాజకీయ (Telangana Politics) ప్రచారాలు ఎవరికి వారు తమ తమ స్టైల్ లో ఎన్నికల ప్రచార హస్త్రాలను ప్రత్యర్థులపై ఎక్కు పెటడుతు ముందుకు సాగుతున్నారు. నేటి మంత్రి కేసీఆర్ (Minister KTR) కూడా తన సొంత ఇలాక సిరిసిల్ల జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ టెక్ సెల్ఫింగ్ కార్యక్రమాన్ని ఉదయం 10:45 గంటలకు ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. తర్వాత కేటీఆర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు వేములవాడ, మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన యువజన ఆత్మీయ సమ్మేళనాలకు హాజరు కానున్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా సిరిసిల్లా వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నేతలు.. కార్యకర్తలు.

KCR : కేసీఆర్ మీద పోటీకి రేవంత్ రెడీ.. ఆత్మవిశ్వాసమా.. అహంకారమా..

ఇక ఈ కార్యక్రమాల తర్వాత.. జగిత్యాల బస్టాండ్ సమీపంలోని ఐబీపీ గోదాం గ్రౌండ్లో జరిగిన యువజన స్ఫూర్తి సబలో జెడ్పీటీసీ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, బండ నర్సయ్య, ఏనుగు మనోహార్రెడ్డి, రాఘవరెడ్డి.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapally Vinod Kumar), వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, తదితరులు పాల్గొననున్నారు. తర్వాత ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాయత్రి డిగ్రీ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు యువ ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, నాఫాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆరు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.