Ayodhya Rama Mandir : అయోధ్యలో అద్భుతం.. శ్రీరామనవమి రోజున.. బాలరాముడి నుదిటిని తాకిన సూర్యకిరణాలు

శ్రీరామనవమి (Sri Ramanavami) పర్వదినాన అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భారత దేశంలో ఎక్కడ లేని విధంగా.. అయోధ్య రామాలయం గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదిటిని సూర్యకిరణాలు ముద్దాడాయి.

అయోధ్య (Ayodhya) ఈ పేరు వినగానే రాముడి గుడి అయోధ్య గుర్తుకు వస్తుంది. కొన్ని వందల సంవత్సరాలుగాలు ఎన్నో ఉద్యామాలు.. పోరాటంలో.. ప్రాణాలు కోల్పోయిన రామ భక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే.. అయోధ్య నుండి రామ సేతు ధాకా.. ఎన్ని రహస్యాలు.. ఉన్నాయి. ఎట్టకేలకు 2023 ప్రధాని నరేంద్ర మోదీ కృషితో.. భారత న్యాయస్థానం సహకారంతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుపుంకుంది. ప్రపంచ హిందు.. రామ భక్తులకు రామలయం కట్టడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అని కూడా రామలయం కట్టిన తర్వాత వచ్చిన తొలి శ్రీరామ నవమి కావడంతో ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆ అయోధ్య రామయ్య దర్శనం కోసం వేల కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

మరి ఇంతటి చరిత్ర ఉన్న అయోధ్యకు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా.. అరి అందుకే..ఈరోజు ఓ అద్భుతం జరిగింది.. మప అయోధ్య రామ మందిరంలో అందేంటో తెలుసుకుందా పదండ్డి..

శ్రీరామనవమి (Sri Ramanavami) పర్వదినాన అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భారత దేశంలో ఎక్కడ లేని విధంగా.. అయోధ్య రామాలయం గర్భగుడిలో ఉన్న బాలరాముడి నుదిటిని సూర్యకిరణాలు ముద్దాడాయి. సూర్యాభిషేకం, సూర్య తిలకం (Surya Tilak) గా వ్యవహరిస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని రామభక్తులు కనులారా వీక్షించారు. జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కొత్త ఆలయంలో శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇదే తొలి రామనవమి రోజున ఈ రాముడి నూదిటిపై సూర్య కిరణాలు పడేవిధంగా.. రామమందిరం మూడో అంతస్తు నుంచి ఏర్పాటు చేసిన కటకాలు, అద్దాలు, గేర్ బాక్స్‌లు, గొట్టాల ద్వారా సూర్య కిరణాలు బాలక్‌ రామ్‌ నుదిటిని తాకాయి.

మధ్యాహ్నం 12.01 గంటలకు, సూర్యకిరణాలు అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లా నుదుటిపై రెండు నుండి రెండున్నర నిమిషాల పాటు నీలిచింది. ఈ అద్భుత దృశ్యం అక్కడి రామ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. తిలక్ పరిమాణం దాదాపు 58 మి.మీ. ‘సూర్య తిలకం’ అద్దాలు మరియు లెన్స్‌లతో కూడిన విస్తృతమైన యంత్రాంగం ద్వారా సాధ్యమైంది. ఇది షికారా సమీపంలోని మూడవ అంతస్తు నుండి గర్భగుడిలోకి సూర్యుని కిరణాలు ప్రతిబింబించేలా సహాయపడింది.

SSM