Raja Singh-Madhavi Latha: ఐ డోంట్‌ కేర్‌.. మాధవీలతకు షాకిచ్చిన రాజాసింగ్‌

గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ పదవిని ఆశించారు రాజాసింగ్‌. కానీ ఆ పదవి ఆయనకు దక్కలేదు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రాజాసింగ్‌. ఇదిలా కంటిన్యూ అవుతున్న సమయంలోనే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను ఫైనల్‌ చేసింది.

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 05:56 PM IST

Raja Singh-Madhavi Latha: హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు ఎమ్మెల్యే రాజాసింగ్‌ షాకిచ్చారు. మాధవీలత నామినేషన్‌కు రాజాసిగ్‌ రాలేదు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ ఎలక్షన్‌ ఇంచార్జ్‌గా ఉన్నా కూడా పార్టీ అభ్యర్థి నామినేషన్‌కు రాజాసింగ్‌ రాలేదు. దీంతో ఈ ఎన్నికల్లో మాధవీలతకు రాజాసింగ్‌ సపోర్ట్‌ ఇక ఉండకపోవచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేవలం ఈ ఒక్కటే కాదు.. చాలా కాలం నుంచి పార్టీ మీద అలకబూనారు రాజాసింగ్‌.

YS JAGAN: ముగిసిన సిద్ధం యాత్ర.. జగన్‌ కన్నీటి లేఖ..

గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ పదవిని ఆశించారు రాజాసింగ్‌. కానీ ఆ పదవి ఆయనకు దక్కలేదు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రాజాసింగ్‌. ఇదిలా కంటిన్యూ అవుతున్న సమయంలోనే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలతను ఫైనల్‌ చేసింది బీజేపీ హైకమాండ్‌. అప్పుడు రాజాసింగ్‌ చేసిన కామెంట్‌ కూడా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అసదుద్దీన్‌ మీద పోటికి దింపేందుకు మీకు మొగాడు దొరకలేదా అంటూ బీజేపీ హైకమాండ్‌ను ప్రశ్నించారు రాజాసింగ్‌. ఆ తరువాత పార్టీ ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. ఒక్కసారి కూడా ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఒక్క మీటింగ్‌కు కూడా రాలేదు. కనీసం ప్రెస్‌ మీట్‌ కూడా పెట్టలేదు. రాజాసింగ్‌ లేకుండా మాధవీలత ప్రచారం చేస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రచారానికి వచ్చినా కూడా రాజాసింగ్‌ కనీసం అటెండ్‌ అవ్వలేదు.

బీజేపీ పెద్దలు రాజాసింగ్‌ను కలిసి పార్టీ కార్యక్రమాలకు రావాలి మాధవీలతకు సహకరించాలి అని కోరినా రాజాసింగ్‌ మాత్రం డోంట్‌ కేర్‌ అన్నారు. దీంతో ఇక మాధవీలతకు రాజాసింగ్‌ సపోర్ట్‌ ఉండదు అనేది మాత్రం క్లియర్‌ అనే టాక్‌ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పోలింగ్‌కు ఇంకా నెల కూడా లేదు. హైదరాబాద్‌లో రాజాసింగ్‌ బీజేపీకి చాలా కీలక నేత. ఇలాంటి టైంలో ఆయన అలకబూనడం. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం మాధవీలతకే మైనస్‌ అంటున్నారు విశ్లేషకులు.