MLC Kavitha : బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ కొత్త డ్రామా : ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ సీనియర్ నేతలు జనానికి బాండ్ పేపర్లు రాసిచ్చే దుస్థితి ఎందుకు వచ్చింది ? వాళ్ళని జనం నమ్మే అవకాశం లేకపోవడంతో ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. కర్ణాటకలో చేసిన డ్రామానే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

  • Written By:
  • Publish Date - November 28, 2023 / 12:15 PM IST

Kavitha on Congress, BJP: బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామా మొదలుపెట్టారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ క్యాంపాఫీసులో మాట్లాడిన ఆమె 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఇంత స్థాయికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. కాగ్రెస్ లీడర్లు జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దామోదర రాజనరసింహా, భట్టి విక్రమార్క లాంటి పెద్ద నాయకులు కూడా బాండ్ పేపర్ రాసివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రజల్లో కాంగ్రెస్ ఎంత విశ్వాసం కోల్పోయిందో చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నారు.  కర్నాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఇదే డ్రామా చేసిందన్నారు కవిత.  223 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాశారు. కానీ అందులో వేటిని కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత.

కర్నాటకలో మహిళలకు రూ. 2వేల పెన్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లాంటి హామీలను ఇంకా మొదలు పెట్టలేదు. యువనిధి కింద ఇస్తామన్న మొత్తాన్ని కూడా పంపిణీ చేయడం లేదని తెలిపారు కవిత. బియ్యం పథకానికి బియ్యం లేదని చెప్పి అది కూడా పంపిణీ చేయడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి బస్సుల సంఖ్య భారీగా తగ్గించారు. కర్నాటక సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు సీనియర్ నాయకులు మొత్తం ఇదే రకమైన డ్రామా చేశారని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం నిరుద్యోగంలో బీజేపీ పాలనలో  ఉన్న రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ వందల్లో కూడా లేవన్నారు. బీఆర్ఎస్ హయాంలో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామనీ… యువ మిత్రులు ఇధి తెలుసుకోవాలన్నారు కవిత.  కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే మీకోసం… ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారని హామీ ఇచ్చారు.