MLC KAVITHA: ఈడీ ఆఫీస్‌లో కొడుకును చూసి.. కన్నీళ్లు ఆపుకోలేపోయిన కవిత..

కొడుకు ఆర్యను చూడగానే కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తల్లిని చూడగానే ఆర్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తల్లీకొడుకుల భావోద్వేగం చూసి.. చుట్టూ పక్కన ఉన్న వాళ్లు కూడా చాలా ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - March 23, 2024 / 06:32 PM IST

MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను.. ఆమె కుమారుడు ఆర్యతో పాటు కుటుంబసభ్యులు కలిశారు. కస్టడీలో ఉన్న కవితను.. ప్రతీరోజు గంటసేపు ఫ్యామిలీ మెంబర్స్‌ కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. శుక్రవారం రాత్రి.. కవితను కుటుంబసభ్యులు కలుసుకున్నారు. కొడుకు ఆర్యను చూడగానే కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తల్లిని చూడగానే ఆర్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Radhika Sarathkumar: రాధిక మీద పోటీకి కెప్టెన్‌ కొడుకు.. ఆయనకే టికెట్ ఎందుకంటే..

తల్లీకొడుకుల భావోద్వేగం చూసి.. చుట్టూ పక్కన ఉన్న వాళ్లు కూడా చాలా ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. అరెస్ట్ అయినప్పుడు కూడా.. కొడుకును చూసి కవిత చాలా ఎమోషనల్ అయింది. తల మీద నిమురుతూ.. హగ్ చేసుకొని ఆర్యకు ధైర్యం చెప్పి.. ఈడీ అధికారులతో కలిసి ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. ఐతే ఈడీ ఆఫీస్‌లో తల్లిని చూసి ఆర్య.. కన్నీళ్లు ఆపుకోలేకపోయాడట. ఆ పిల్లోడిని చూసి.. తోడు వచ్చిన కుటుంబసభ్యులు కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారని తెలుస్తోంది. ఇక అటు కవితకు మరో మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను.. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఐటీ పత్రాలు అడుగుతున్నారని.. ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.

తనకు బెయిల్ ఇవ్వాలని సెషన్స్ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. ప్రస్తుతం బెయిల్‌కు విచారణ అర్హత లేదని ఈడీ వాదించింది. పిటిషన్‌పై ఈడీకి నోటీసులు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరారు. దీంతో.. కవిత పిటిషన్‌ విచారణకు కోర్టు స్వీకరించింది. 26వ తేదీన కవిత బెయిల్ పిటిషన్‌పై విచారించనుంది.