MLC KAVITHA : రేవంత్ రెడ్డీ.. నీ బెదిరింపులకు భయపడేవాళ్ళు లేరు ! : ఎమ్మెల్సీ కవిత

80 సీట్ల కంటే ఒక్కటి తక్కువగా వచ్చినా.. ఏదంటే అది చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇలాంటి సవాళ్ళు 10 సార్లు చేశారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గత ఎన్నికల్లో అన్నారని కవిత వివరించారు.

  • Written By:
  • Updated On - November 22, 2023 / 07:53 PM IST

MLC KAVITHA : “పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాసుకుంటామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటున్నారు. రేవంత్ రెడ్డి గారూ.. మీ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరు ఇక్కడ.” అని హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ లోని తన క్యాంపాఫీసులో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ పరిధిలో అధికారులు పనిచేస్తున్నారన్న సంగతి మర్చిపోయి ఏదో చేద్దామని అనుకుంటున్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ పేరును కూడా తెలంగాణ (Telangana) ప్రజలు రెడ్ డైరీలో ఇప్పటికే రాసుకున్నారని చెప్పారు కవిత. బోధన్ లో బీఆర్ఎస్ (BRS) పార్టీ అభ్యర్థి షకీల్, కార్యకర్తలపై కాంగ్రెస్ చేసిన దాడిని కవిత ఖండించారు. ఇలా దాడులకు తెగబడితే ఆ పార్టీకి మనుగడ ఉండదని మండిపడ్డారు.

REVANTH REDDY: రైతులను ఆదుకుంటామని చెప్పి కేసీఆర్ మాట తప్పాడు: రేవంత్ రెడ్డి

80 సీట్ల కంటే ఒక్కటి తక్కువగా వచ్చినా.. ఏదంటే అది చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇలాంటి సవాళ్ళు 10 సార్లు చేశారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గత ఎన్నికల్లో అన్నారని కవిత వివరించారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా రెండు మూడు నెలలకే ప్రభుత్వం అస్థిరమైతుందని ఆరోపించారు. కర్నాటకలో అధికారంలోకి వచ్చి 3నెలలు కాకముందే కుమ్ములాటలు మొదలయ్యాయనీ.. ఇప్పటికే సిద్దరామయ్య, డీకే శివ కుమార్ పోటీ పడుతుంటే కొత్తగా సతీష్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే తానే సీఎం అవుతానని అంటున్నారని కవిత చెప్పారు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్ ఎప్పుడూ కొట్లాడుకుంటూనే ఉంటారు. మధ్య ప్రదేశ్ లో ప్రజలు అధికారం ఇస్తే కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా కొట్లాడుకొని ఏడాదిలోనే ప్రభుత్వాన్ని కూల్చేశారని వివరించారు.

తెలంగాణకు పూటకో ముఖ్యమంత్రి కావాలా, స్థిరమైన పరిపాలన కావాలా అన్నది ఆలోచన చేయాలని కవిత చెప్పారు. రాజకీయ సుస్థిరత, సరైన శాంతి భద్రతల వల్లే హైదరాబాద్ కు పరిశ్రమలు వస్తున్నాయని, ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని అన్నారు కవిత. మంచినీళ్లు కూడా ఇవ్వని వ్యక్తులు రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అర్థం చేసుకోవాలన్నారు.