MLC KAVITHA: ఎమ్మెల్సీ కవిత కస్టడీలో భాగంగా ఐదో రోజు ఇంటరాగేషన్ చేస్తున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కాంకు సంబంధించిన ప్రశ్నలతో కవిత నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విచారణలో డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా, ఏడీ జోగేందర్ పాల్గొన్నారు. లిక్కర్ స్కాములో కవిత వాటాతో పాటు.. ఆమె ఆర్థిక లావాదేవీలపైనా అధికారులు ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో సౌత్ గ్రూప్ పాత్ర ఏంటి.. అందులో కవితకు ఎలాంటి సంబంధం ఉందన్న అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
BRS Krishank: రేవంత్ సోదరుడిపై ఆరోపణలు.. BRS సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌పై కేసు !
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర మంత్రులు, అధికారులతో కవిత ఎప్పుడు.. ఎక్కడ మాట్లాడారు. ఏమని మాట్లాడుకున్నారో చెప్పాలని అడిగారు. హవాలా ద్వారా ఆప్ నేతలకు ముడుపులు ఎలా..? ఎక్కడ? ఎంత మొత్తం ఇచ్చారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయంటున్నారు ఈడీ అధికారులు. మీరు ఏం చేశారో.. మీ పాత్ర ఏంటో మీరే ఒప్పుకుంటే సరే.. లేకపోతే.. తామే అన్ని ఆధారాలు చూపించి ఒప్పిస్తామని కవితతో చెప్పినట్టు సమాచారం. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపాక.. మొబైల్ ఫోన్లను ఎందుకు ఫార్మాట్ చేశారు.. అందులో ఉన్న డేటాను ఎందుకు తొలగించారని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ద్వారా మీకు 192 కోట్ల రూపాయల డబ్బు ముట్టింది. వాటిని ఏం చేశారు? ఎక్కడెక్కడ ఎంత మొత్తం ఖర్చు చేశారని కూడా ఈడీ అధికారులు కవితను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. బంజారాహిల్స్‌లో ఇంటిని బిగ్ సి మొబైల్ కంపెనీ ఓనర్ నుంచి ఎంతకు కొన్నారు ? 6 వేల గజాల స్థలంలో ఇల్లు కొనడానికి మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ప్రశ్నించారు ఈడీ అధికారులు.
2014కి ముందు ఆస్తులు ఎంత ? తర్వాత ఇన్ని ఆస్తులు ఎలా కొన్నారు..? ఈ పెట్టుబడి పెట్టడానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కవితను ఈడీ అధికారులు అడిగినట్టు సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు కదా. ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మీ భర్తకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వందల కోట్ల రూపాయల విలువైన ఈ స్థిరాస్తులు కొనడానికి డబ్బు ఎలా వచ్చిందని కూడా అడిగారు అధికారులు. ఈ సందర్భంగా కవిత చేతికి ఉండే ఖరీదైన వాచ్ గురించి ఈడీ అధికారులు ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. గతంలో మీ చేతికి కోటి రూపాయల ఖరీదైన వాచ్ పెట్టారు కదా.. అది ఇప్పుడు ఎక్కడుంది? ఆ వాచ్ ని మీకు ఎవరు గిఫ్ట్ గా ఇచ్చారు.. ఎందుకిచ్చారని ప్రశ్నించినట్టు సమాచారం. ఈడీ ప్రశ్నల ధాటికి కవిత కొన్నింటికి సమాధానం చెబుతున్నా.. మరికొన్ని దాటవేస్తున్నట్టు తెలుస్తోంది.