తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) నేడు ఎటు చూసినా సందడి సందడిగానే కనపడుతుంది. నేడు నామినేషన్లకు మంచి రోజు కావడంతో అన్ని పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీలు తీసుకుంటు వేళ్తున్నారు. రేపు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో కూడా చాలా మంది నేడు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు సమర్పిస్తున్నారు.
KCR nomination : రెండు నియోజకవర్గాల్లో గజ్వేల్ – కామారెడ్డి లో కేసీఆర్ నామినేషన్..
నిజామాబాద్ జిల్లా బోధన్ (Bodhan) లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ ( MLA, Shakil) నామినేషన్ (Nomination) సందర్భంగా భారీ ర్యాలీ తీశారు. షకీల్ ర్యాలీ తో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది బోధన్ లో.. షకీల్ నామినేషన్ సందర్భంగా నిజామాబాద్ మాజీ ఎంపీ..ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత కూడా హాజరు అయ్యేందుకు వస్తుండగా.. భారీ ట్రాఫిక్ జామ్ లో కవిత కారు ఇరుక్కుపోయింది.దీంతో సమయం మించిపోవడంతో.. ర్యాలీ ప్రారంభ స్థలానికి ఎమ్మెల్సీ కవిత స్కూటీ పై వెళ్లారు.ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. దీంతో ఎన్నికల వేళ స్కూటీ పై ఎమ్మెల్యీ కవిత ప్రయాణిస్తు సందడి చేసింది. ఈ మీడియాలో సోషల్ తెగ వైరల్ అవుతుంది.
కాగా ఉదయం 11.06 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు చోట్ల.. గజ్వేల్ నామినేషన్ వేస్తు నామినేషన్ పత్రాలను ఆర్డీఓ బన్సీలాల్ కు అందజేశారు సీఎం కేసీఆర్. తర్వాత కామారెడ్డిలో నామినేషన్ వేశారు. సిరిసిల్లలో కేటీఆర్ నామినేషన్ వేశారు.